Home » టీ 20లో ఇంత  చెత్త రికార్డు కూడా నమోదవుతుందా ?

టీ 20లో ఇంత  చెత్త రికార్డు కూడా నమోదవుతుందా ?

by Anji
Ad

టీ-20 మ్యాచ్ ప్రారంభమైన తరువాత బ్యాటింగ్ లో ఎక్కడ లేని దూకుడుని మనం చూస్తున్నాం. కళ్లు చెదిరే బ్యాటింగ్ విన్యాసాలు, హిట్టర్ల విధ్వంసక ఇన్నింగ్స్ లకు ఈ మ్యాచ్ వేదిక అవుతున్నాయి. అప్పుడప్పుడు బౌలర్లు మెరిసినప్పటికీ పై చేయి మాత్రం బ్యాటింగ్ దే అని చెప్పవచ్చు. అలాంటి ఫార్మాట్ లో ఓ చెత్త రికార్డు నమోదు అయింది. చెత్త రికార్డు కంటే దానిని పరమ చెత్త రికార్డుగా చెప్పుకోవాలి. ఎందుకంటే టీ20లో సంచలనాన్ని నమోదు చేస్తూ.. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు కేవలం 10 పరుగులకే ఆలౌట్ అయింది. 11 రన్స్ తేడాతో టార్గెట్ తో బరిలోకి దిగిన మరోజట్టు రెండు బంతుల్లోనే మ్యాచ్ ని ముగించింది. అసలు ఈ చెత్త రికార్డు నమోదైంది ఏ మ్యాచ్ లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

టీ20 క్రికెట్ లో ఇప్పటివరకు అత్యల్ప స్కోర్ సిడ్నీ థండర్స్ పేరిట ఉంది. బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ థండర్స్ జట్టు 15 పరుగుకే కుప్పకూలింది. ఆడిలైడ్ స్ట్రయికర్స్ తో జరిగినటువంటి మ్యాచ్ లో ఆ జట్టు టీ 20లోనే అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఇప్పుడు స్పెయిన్ తో జరిగిన మ్యాచ్ లో ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు ఆ రికార్డును తిరగరాస్తూ.. కేవలం 10 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఈ ఫార్మాట్ లో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇస్లే ఆఫ్ మ్యాన్ స్పెయిన్ జట్ల మధ్య లా మంగా క్లబ్ బోటమ్ గ్రౌండ్ లో ఈ మ్యాచ్ జరిగింది. ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు 8.4 ఓవర్లు ఆడి 10 పరుగులకే కుప్పకూలింది. టీ 20 క్రికెట్ లో అతితక్కువ స్కోరు సాధించిన చెత్త రికార్డు నమోదు చేయడం విశేషం. 

Advertisement

Also Read :  IPL 2023 : ముంబై ఇండియన్స్ కు షాక్… ఐపీఎల్ నుంచి పేసర్ బుమ్రా అవుట్!

Manam News

2019లో చెక్ రిపబ్లిక్ తో జరిగిన మ్యాచ్ లో టర్కీ 21 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఈనెల 25న స్పెయిన్ తో జరిగిన మ్యాచ్ లో ఇస్లే ఆఫ్ మ్యాన్ 66 పరుగులకు ఆలౌట్ అయింది. ఇప్పటివరకు ఆ జట్టు 16 టీ 20లు ఆడింది. వీటిలో 8 మ్యాచ్ లను గెలిచింది. వీటిలో 7 మ్యాచ్ లను గెలిచింది. ఒక మ్యాచ్  ఫలితం తేలలేదు. స్పెయిన్ తో జరిగిన 6 మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు 0-5 తో ఓటమిని మూటగట్టుకోగా.. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఇక  మొత్తానికి టీ 20లలో బ్యాటింగ్ తో విధ్వంసమే కాదు.. బాల్ తో కూడా రికార్డులను సృష్టించవచ్చు అని నిరూపించారు బౌలర్లు. 

Also Read :  పవన్ కళ్యాణ్ సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్.. రెమ్యునరేషన్ ఎంతంటే? 

Visitors Are Also Reading