Home » జగన్‌తో వేణు స్వామి… అసలు విషయం ఏమిటంటే..?

జగన్‌తో వేణు స్వామి… అసలు విషయం ఏమిటంటే..?

by Sravya
Ad

వేణు స్వామి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ వేణు స్వామి పాపులర్ అయిపోయారు, సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్ళకి వేణు స్వామి గురించి ప్రత్యేకించి పరిచయం చెయ్యక్కర్లేదు. సమంత నాగచైతన్య విడిపోతారని వేణు స్వామి చెప్పినప్పటి నుండి ఆయన పాపులర్ అయిపోయారు. ట్రెండింగ్ అంశాలు, ట్రెండింగ్ లో ఉన్న సెలెబ్రిటీల మీద జ్యోతిష్యం చెప్తూ ఉంటారు. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో వేణు స్వామి ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

venuswamy

Advertisement

ఇద్దరు కారులో వెళ్తూ మామూలుగా మాట్లాడుకుంటున్న వీడియో వేణు స్వామి ఇప్పటికే ఎన్నికల ఫలితాలు గురించి వెల్లడించారు. అనేక ఇంటర్వ్యూలలో ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయాన్ని బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని సాధిస్తారని, పక్కా గెలుస్తారని వేణు స్వామి అన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడం పక్కా అని జనసైనికులు చెప్తుంటే, పవర్ స్టార్ కి రాజకీయ యోగం లేదని ఆయన అన్నారు.

Advertisement

Also read:

venuswamy-and-jagan-mohan

Also read:

వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం అవ్వడం కచ్చితం అయినప్పటికీ ఆయన కొన్ని న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటారని అన్నారు. తాజాగా వేణు స్వామి, జగన్ కలిసి ఉన్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వేణు స్వామి కూడా వైసీపీ మనిషి అని ఈ వీడియో చూసి అంతా అంటున్నారు. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు నాలుగేళ్ల కిందట నాటిది. 2019లో ఇద్దరూ కలిసి కారులో వెళ్తున్నప్పుడు వీడియో ఇది. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading