Home » కోహ్లీ హాఫ్ సెంచరీ వృథా… గుజరాత్ దే గెలుపు..!

కోహ్లీ హాఫ్ సెంచరీ వృథా… గుజరాత్ దే గెలుపు..!

by Azhar
Ad
ఐపీఎల్ 2022 లో ఈరోజు మొదటి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చి హాఫ్ సెంచరీ చేసిన అది వృథా అయిపోయింది. గుజరాత్ జట్టునే మళ్ళీ విజయం వరించింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూర్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
దాంతో మొదట బౌలింగ్ చేసిన గుజరాత్ జట్టు బెంగళూర్ కెప్టెన్ డుప్లెసిస్ ను డక్ అవుట్ గా పెవిలియన్ చేర్చింది. కానీ ఆ తర్వాత కోహ్లీ, రజత్ పాటిదార్ ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు, ఇదే క్రమంలో 52 పరుగులు చేసి పాటిదార్ పెవిలియన్ చేరుకోగా.. కొన్ని రోజులుగా బ్యాటింగ్ లో ఇబ్బంది పడుతున్న కోహ్లీ ఈ ఐపీఎల్ 2022 లో 58 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత మాక్స్వెల్ ఒక్కడే 33 పరుగులు చేయగా మిగితా వారు నిరాశపరచడంతో బెంగళూర్ 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది.
ఇక 171 పరుగుల లక్ష్యంతో వచ్చిన గుజరాత్ జట్టుకు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు సాహా(29), గిల్(31) ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ 20 పరుగులు చేయగా కెప్టెన్ పాండ్య 3 పరుగులకే వెనుదిరిగాడు. కానీ ఆ వెంటనే మిల్లర్, రాహుల్ తెవాటియా క్రీజులో కుదురుకొని మరో 3 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించారు. ఇది ఈ ఐపీఎల్ లో గుజరాత్ కు 8వ విజయం కాగా.. బెంగళూర్ కు వరుసగా 3వ పరాజయం.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading