Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » కోహ్లీ ప్లాప్ షో పై దాదా కీలక వ్యాఖ్యలు…!

కోహ్లీ ప్లాప్ షో పై దాదా కీలక వ్యాఖ్యలు…!

by Azhar
Ads

ఐపీఎల్ లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమవుతున్న విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓపెనర్ గా వచ్చిన వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీ మాత్రం పరుగులు చేయలేకపోతున్నాడు. డబల్ డిజిట్ స్కోర్ చేయడానికే ఎన్నో కష్టాలు పడుతున్నాడు. ఇక కోహ్లీ విఫలం కావడానికి బీసీసీఐ కారణం అని అతని అభిమానులు అంటున్నారు.

Advertisement

Ad

బీసీసీఐ బాస్ గంగూలీ, విరాట్ కోహ్లీకి మధ్య ఉన్న బంధం గురించి అందరికి తెలిసిందే. అందుకే దాదా కోహ్లీపై ఒత్తిడి తెస్తున్నాడు అని ఫ్యాన్స్ అంటున్నారు. అతడిని అనవసరంగా కెప్టెన్సీ నుంచి తప్పించారని పేర్కొంటున్నారు. ఇటువంటి తరుణంలో కోహ్లీ పేలవ ఫామ్ పై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కీలక వ్యాఖ్యలు చేసాడు.

తాజాగా కోహ్లీ గురించి దాదా మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. అతను ఇంతకముందు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడు. కానీ అతను త్వరలోనే భారీ ఇన్నింగ్స్ ఆడుతాడు. అయితే కోహ్లీ ఏం ఆలోచిస్తునాడు అనేది నాకు తెలియదు. కానీ అతను మల్లి ఫామ్ లోకి వచ్చి పరుగుల వరద పారిస్తాడు అనే నమ్మకం నాకు ఉంది అని గంగూలీ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీకి రెస్ట్ ఇవ్వం : బీసీసీఐ

Advertisement

కేకేఆర్ ను ఎలన్ మస్క్ కొనాలి అంటూ డిమాండ్…!

Visitors Are Also Reading