Home » తండ్రి ప్రపంచ దిగ్గజ క్రికెటర్.. తనయుడి కెరీర్ మాత్రం 11 మ్యాచ్ లకే పరిమితం.. ఆ ప్లేయర్ ఎవరంటే..? 

తండ్రి ప్రపంచ దిగ్గజ క్రికెటర్.. తనయుడి కెరీర్ మాత్రం 11 మ్యాచ్ లకే పరిమితం.. ఆ ప్లేయర్ ఎవరంటే..? 

by Anji
Ad

సునీల్ గవాస్కర్ అనే పేరు భారత క్రికెటర్ లవర్స్ కి ప్రత్యేకంగా పరిచయం పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. అద్భుతమైన ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అదేవిదంగా ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. 1970, 80లలో భారత క్రికెట్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ తన అపూర్వమైన సేవలందించాడు. తన హయాంలో 34 టెస్ట్ సెంచరీలతో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన క్రికెటర్ గా ప్రపంచ రికార్డుని సృష్టించాడు.   

Advertisement

 ఆ తరువాత ఈ రికార్డును సచిన్ అధిగమించిన విషయం విధితమే. ఇలాంటి స్టార్ ప్లేయర్ వారసుడు క్రికెట్ లోకి అడుగు పెడితే.. ఆయనపై అంచనాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సునీల్ గవాస్కర్ తనయుడు రోహన్ గవాస్కర్ క్రికెట్ ప్రపంచంలో అడుగుపెట్టిన సమయంలో అతనిపై చాలా అంచనాలున్నాయి. రోహన్ మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఇవాళ రోహన్ పుట్టిన రోజు. ఫిబ్రవరి 20, 1976లో ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జన్మించాడు రోహన్. ఈ సందర్భంగా క్రికెట్ జర్నీకి సంబంధించి కొన్ని వివరాలను సునీల్ గవాస్కర్ కుడిచేతి వాటం బ్యాట్స్ మెన్ అయితే.. అతని కుమారుడు రోహన్ ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్. టీమ్ ఇండియాలో చోటు దక్కినా.. అతని కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. 

Advertisement

Also Read :  CCL 2023 :అఖిల్ అక్కినేని విధ్వంసం.. తెలుగు వారియర్స్ విక్టరీ

2003-2004 ఆస్ట్రేలియా పర్యటనలో రోహన్ కి టీమిండియాలో అవకాశం లభించింది. అయితే రోమన్ జనవరి 18, 2004 ఆస్ట్రేలియాపై అవకాశం దక్కించుకున్నాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి అతను ఔట్ అయ్యాడు. ఇక ఈ పర్యటనలో అతను ఆడిలైట్ లో జింబాబ్వే పై హాఫ్ సెంచరీ సాధించాడు. ఇన్నింగ్స్ 54 పరుగులు చేసాడు. రోహన్ కెరీర్ లోనే తొలి, చివరి హాఫ్ సెంచరీ ఇదే కావడం విశేషం. బౌలింగ్ విషయానికొస్తే.. రోహన్ బౌలింగ్ లో ఆండ్రూ సమైండ్స్ వికెట్ ని పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Also Read :   ఐపీఎల్ 2023 షెడ్యూల్ : హైద‌రాబాద్‌ వేదిక‌గా 7 మ్యాచ్‌లు!

Visitors Are Also Reading