Home » CCL 2023 :అఖిల్ అక్కినేని విధ్వంసం.. తెలుగు వారియర్స్ విక్టరీ

CCL 2023 :అఖిల్ అక్కినేని విధ్వంసం.. తెలుగు వారియర్స్ విక్టరీ

by Bunty
Ad

మన ఇండియాలో క్రికెట్‌ కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఏ ఆటకు లేని.. ఫ్యాన్స్‌ కేవలం క్రికెట్‌ కే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే, తాజాగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మళ్లీ మొదలైంది. దాదాపు రెండేళ్ల తర్వాత శనివారం తిరిగి ప్రారంభమైంది. కాగా, ఆదివారం రాయపూర్ స్టేడియం వేదికగా తెలుగు వారియర్స్ కేరళ స్ట్రైకర్స్ మధ్య లీగ్ మూడో మ్యాచ్ జరిగింది.

Advertisement

ఈ మ్యాచ్ లో యువకథానాయకుడు అక్కినేని అఖిల్ నాయకత్వం వహిస్తున్న తెలుగు వారియర్స్ జట్టు 64 పరుగులు తేడాతో విజయం సాధించింది. కాగా, ఈ మ్యాచ్ లో అఖిల్ అద్భుత ప్రదర్శన చేశాడు. మొదటి ఇన్నింగ్స్ లో 91, రెండో ఇన్నింగ్స్ లో 63 పరుగులు సాధించిన జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. అయితే ప్లేయర్లను ఎంకరేజ్ చేయడానికి ప్రముఖ సినీ నటులు వెంకటేష్ తదితరులు వచ్చారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన తెలుగు వారియర్స్ మొదటి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు నష్టానికి 154 పరుగులు చేసింది.

Advertisement

తెలుగు వారియర్స్ కెప్టెన్ అక్కినేని అఖిల్ సూపర్ ఇన్నింగ్స్ ఆడి 30 బంతుల్లో 91 పరుగులు చేశాడు. మరో ప్లేయర్ ప్రిన్స్ 23 బంతుల్లో 45 పరుగులు చేసి రాణించాడు. ఇలా మొదటి ఇన్నింగ్స్ లీడ్ తో కేరళ జట్టుకు 170 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది తెలుగు టీం. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కేరళ జట్టు, ఆఖరి ఓవర్లో 69 పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ ఆ ఓవర్ లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశారు. దీంతో తెలుగు వారియర్స్ 64 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించింది. నందమూరి తారకరత్న మరణం పట్ల ప్లేయర్స్ సంతాపం తెలిపారు.

Read Also: నందమూరి తారకరత్న అరుదైన చిత్రాలు

Visitors Are Also Reading