Home » ఆల్ రౌండర్ గా విరాట్ ను వాడండి…!

ఆల్ రౌండర్ గా విరాట్ ను వాడండి…!

by Azhar
Ad

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని గత ఏడాది పాటుగా విమర్శించినా వారు అందరూ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అందుకు కారణం కోహ్లీ మళ్ళీ పరుగులు చేయడం. అయితే గత ఏడాది నుండి ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటన వరకు కోహ్లీ పరుగులు చేయలేకపోయాడు. దాంతో జట్టుకు 5 వారాలపాటు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ.. ఇప్పుడు నేరుగా ఆసియా కప్ కోసమ్ జట్టూతి కలిసాడు.

Advertisement

ఇక ఈ టోర్నీలో మొదట పాకిస్థాన్ పై విలువైన రన్స్ చేసిన విరాట్.. హాంగ్ కాంగ్ పైన అర్ధశతకం బాదేశాడు. అంతేకాకుండా ఒక్క ఓవర్ బౌలింగ్ కూడా చేసాడు. ఇక కోహ్లీ వేసిన ఆ ఒక్క ఓవర్ తో అతడిని ఆల్ రౌండర్ గా ఆడించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే నిన్న హాంగ్ కాంగ్ మ్యాచ్ లో మన జట్టులో ఉన్న ఆటగాళ్లు అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్ భారీగా పరుగులు ఇచ్చారు.

Advertisement

దాంతో కెప్టెన్ రోహిత్ కోహ్లీకి బల్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ లో 17వ ఓవర్ వేసిన విరాట్ కేవలం 6 పరుగులే ఇచ్చాడు. దాంతో జట్టులోని ఆ బౌలర్ల కంటే కోహ్లీనే బాగా బౌలింగ్ చేసాడు. బ్యాటర్లను పరుగులు చేయకుండా ఆడుకున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మిగిలిన మ్యాచ్ లలో కుడా వారికీ బదులు కోహ్లీని ఆల్ రౌండర్ గా వాడుతూ.. కనీసం మూడు ఓవర్లు అయిన వేయించాలని కోరుకుంటున్నారు అభిమానులు.

ఇవి కూడా చదవండి :

షాహీన్ ఆఫ్రిదీకి ఐపీఎల్ వేలంలో 15 కోట్లు..!

రాహల్ పై పగ తీర్చుకున్న పంజాబ్..!

Visitors Are Also Reading