Telugu News » Blog » షాహీన్ ఆఫ్రిదీకి ఐపీఎల్ వేలంలో 15 కోట్లు..!

షాహీన్ ఆఫ్రిదీకి ఐపీఎల్ వేలంలో 15 కోట్లు..!

by Manohar Reddy Mano
Ads
ఐపీఎల్ అనేది క్రికెట్ ప్రపంచంలో ఓ పెద్ద లీగ్. ఇందులో ఆడాలి అని క్రికెటర్స్  అందరూ అనుకుంటారు. అయితే ఏ దేశ ఆటగాడు అయిన ఐపీఎల్ లో ఆడవచ్చు కానీ పాకిస్థాన్ ఆటగాళ్లకు అవకాశం లేదు. 2008 లో బీసీసీఐ మొదటిసారి ఐపీఎల్ ను ప్రారంభించిన సమయంలో పాక్ ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడారు. కానీ ఆ తర్వాత ముంబైలో జరిగిన దాడుల తర్వాత ఐపీఎల్ లో పాక్ ఆటగాళ్లను బ్యాన్ చేసారు.
అయితే ఇప్పుడు పాకిస్థాన్ లో ఉన్న ఆటగాళ్లు ముఖ్యంగా ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ గనున్న ఐపీఎల్ లోకి వస్తే అతనికి 15 కోట్లు వస్తాయని భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. అయితే తాజాగా అశ్విన్ మాట్లాడుతూ.. నాకు ఈ మధ్యే పాకిస్థాన్ ఆటగాళ్లు ఐపీఎల్ లోకి వస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది.
పాకిస్థాన్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ చాలా గట్టిగ ఉంటుంది. షాహీన్ ఆఫ్రిదీ గనున్న ఐపీఎల్ లోకి వస్తే 15 కోట్లు పక్క. అతను చాలా పొడవు ఉంటాడు. పైగా షాహీన్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. డెత్ లో యార్కర్లు వేస్తూ బ్యాటర్లను కట్టడి చేస్తాడు. ఇన్ని లక్షణాలు ఉన్న ఏ బౌలర్ ను అయిన ఐపీఎల్ లో భారీ ధరకు కొంటారు. కాబట్టి షాహీన్ ఆఫ్రిదీ సులభంగా 15 కోట్లు వస్తాయని అశ్విన్ తెలిపాడు.