Home » తల్లి పాలు ఏ వయస్సులో మాన్పించాలో తెలుసా ?

తల్లి పాలు ఏ వయస్సులో మాన్పించాలో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా చిన్నపిల్లలకు తల్లి సరైన పద్దతిలో పాలు ఇవ్వాలి. అదేవిధంగా సరైన సమయంలోనే వారిని పాలు మాన్పించాలి. ఇలా చేయకపోవడం వల్ల చాలా మంది పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొంటున్నారు ఢిల్లీ వైద్యులు. పిల్లలకు ఐరన్ లోపించడం మనం చాలాసార్లు చూస్తుంటాం. ఐరన్ లోపం వచ్చిన పిల్లల పరిస్థితి కొన్నిసార్లు విషమంగా మారుతుంటుంది. తల్లిపాలు మాన్పించేందుకు పిల్లలకు మెల్లమెల్లగా ఫుడ్ అదిస్తూ.. పాలపై ఆధారపడటాన్ని తగ్గించాలి. 

Advertisement

కేవలం ఆరు నెలల పాటు పిల్లలకు తల్లి పాలు ఇవ్వాలి. ఇక ఆ తరువాత తల్లిపాలు మాన్పించే పని ప్రారంభించాలి. ఆరు నెలల తరువాత మెల్లమెల్లగా తల్లిపాలు ఇవ్వడం తగ్గించి.. బేబీకి ఘన ఆహారాన్ని ఇవ్వాలి. ఆరు నెలల తరువాత పిల్లలు వేగంగా ఎదుగుతారు. ఇక ఈ సమయంలో కేవలం పాలు మాత్రమే ఇస్తే.. ఐరన్, ఇతర పోషకాలు వారి శరీరంలో లోపిస్తాయి. తల్లిపాలు మంచివే.. కానీ ఆరు నెలల తరువాత పిల్లలకు పోషకాలు చాలవు. కాబట్టి కంపల్సరీ తల్లిపాలతో పాటు ఫుడ్ కూడా ఉండాలి. దీనిలో తల్లిదండ్రులు లేదా సంరక్షకులే ఎప్పుడూ పిల్లలకు ఘన ఆహారం ఇవ్వాలో నిర్ణయిస్తారు. ఈ విధానంలో లిక్విడ్ డైట్ లేదా మెత్తగా వండిన ఆహారాన్నిపిల్లలకు స్పూన్ లేదా చేతితో ఇస్తారు.

Advertisement

ఈ విధానాన్ని పేరెంట్ లెడ్ వీనింగ్ అంటారు. తల్లి పాలను మాన్పించే ప్రక్రియలో మరో విధానం బేబీ లెడ్ వీనింగ్. ఇది 2000 సంవత్సరం నుంచి మొదలైంది. పిల్లలకు తమ చేతితో తాము తినడం అలవాటు అయితే వారి ఆరోగ్యానికి చాలా మంచిది. కారణం ఆకలి తెలిస్తే తినడం తెలుస్తుంది. రెండు ముద్దలు తిన్నా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధానం చాలా మంచిది. తల్లి పాలు తప్పనిసరి సంవత్సరానికి ఆపివేయాలి. ఆరు నెలల తరువాత తల్లిపాలు తగ్గించి.. ఆహారం ఇవ్వాలి. అలా అయితేనే పిల్లలో ఎనిమియా సమస్య తగ్గించి చాలా చక్కగా ఎదుగుతారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

తిన్న తర్వాత ఉబ్బరం మరియు విపరీతమైన త్రేనుపుతో ఇబ్బంది పడుతున్నారా? వెంటనే వీటిని తీసుకోవడం మానేయండి..!

భార్య గర్భిణీగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు.. కటింగ్ అస్సలు చేయించుకోవద్దు!

Visitors Are Also Reading