Home » వేసవిలో టీ, కాఫీల వల్ల నష్టాలు చూస్తే.. కచ్చితంగా మానేస్తారు..!

వేసవిలో టీ, కాఫీల వల్ల నష్టాలు చూస్తే.. కచ్చితంగా మానేస్తారు..!

by Sravya
Ad

వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. వేసవి కాలంలో ఆరోగ్యం పట్ల కచ్చితంగా శ్రద్ధ వహించాలి లేదంటే అనవసరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలామంది ఉదయం లేవగానే టీ కాఫీతో రోజు అని మొదలుపెడతారు. కొంతమంది టీ కాఫీలు రోజంతా కూడా తాగుతూ ఉంటారు. నాలుగు ఐదు కప్పులు రోజుకి తీసుకుంటూ ఉంటారు. టీ అంటే చాలామందికి ఇష్టం. అయితే అతిగా టీ కాఫీలు అనే తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా వేసవికాలంలో ఎక్కువగా టీలు తీసుకోవడం వలన అనేక ఇబ్బందులు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Advertisement

ఉదయం నుండి సాయంత్రం నాలుగు దాకా ఇంటి నుండి బయటకి వెళ్లడానికే భయం వేస్తోంది ఎండలో బయటకు వెళ్లే వాళ్ళు తరచు నీళ్లు తీసుకోవడం మంచిది. పండ్లు తీసుకోవడం వలన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని వైద్య నిపుణులు అంటున్నారు చాలా మంది వేసవి కాలంలో కూడా టీ తాగుతూ ఉంటారు. మండే వేసవిలో వేడి వేడి టీ తాగుతూ ఉంటారు. దీని వలన ఆ శరీరానికి ఎంత ప్రమాదమో. వేడి వాతావరణం లో టీ తాగడం వలన నష్టాలు గురించి వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Also read:

Also read:

శరీరంలో ఇబ్బందుల్ని టీ పెంచుతుంది. ఎసిడిటీ, గుండెలో మంట, పుల్లని తేన్పులు వంటివి టీ తాగడం వలన వేసవిలో కలుగుతాయి. వేసవిలో టీ తాగడం మానేస్తే ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది ఈ వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే టీ వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజుకి ఒక కప్పు లేదా రెండు కప్పులు తాగితే పరవాలేదు కానీ అంతకుమించి తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. కాబట్టి పదేపదే టీ తాగే వాళ్ళు అలవాటుని మానుకోండి లేదంటే అనవసరంగా వేసవిలో అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading