Home » గుండెపోటు వచ్చే ముందు సంకేతాలు ఇవే మీలో కూడా ఇలాంటి ఛాయలు వచ్చాయా ?

గుండెపోటు వచ్చే ముందు సంకేతాలు ఇవే మీలో కూడా ఇలాంటి ఛాయలు వచ్చాయా ?

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి చూస్తూ ఉంటారు. అయితే, ఆరోగ్యంగా ఉండాలంటే సరైన జీవన విధానం ని పాటించడం మంచిది. ఆహార పదార్థాలను తీసుకోవడం ఇటువంటివన్నీ కూడా ముఖ్యం. ఇది ఇలా ఉంటే చాలా మంది ఈ రోజుల్లో హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో గుండెనొప్పి సమస్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. సాధారణంగా గుండె నొప్పి అనేది ఎప్పుడో ఒకసారి ఎప్పుడూ ఒకేలా రాదు అని వైద్యులు అంటున్నారు. ముందు వివిధ రూపాల్లో లక్షణాలు కనబడతాయి అవి సకాలంలో గుర్తించగలిగితే తగిన జాగ్రత్తలు తీసుకుని నయం చేసుకోవచ్చు.

Advertisement

హార్ట్ ఎటాక్ అనేది ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా కనపడుతోంది. చాలా ఆందోళన కలిగించే అంశం ఇది. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు శరీరంలో చాలా సంకేతాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలని నిర్లక్ష్యం చేశామంటే మాత్రం కచ్చితంగా ఇబ్బంది ఎదుర్కోవాలి. ఈ ప్రపంచం మొత్తంగా సంభవిస్తున్న మరణాలలో గుండెపోటు కారణంగా చాలామంది చనిపోతున్నారనేది నమ్మలేని నిజం. హార్ట్ ఎటాక్ సంబంధిత లక్షణాలని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. శరీరం ఎక్కువ భాగంలో వచ్చే నొప్పి కీలకమైనది ఈ నొప్పి శరీరంలోని ఏ భాగాల్లో సంభవిస్తుందనేది చూద్దాం. హార్ట్ ఎటాక్ లక్షణాలు ప్రధానమైనది వీపునొప్పి.

Advertisement

హార్ట్ లాక్ వచ్చే ముందు వీపు నొప్పి కలుగుతుంది. కూర్చునే పోస్టర్ లేదా పడుకునే పోస్టర్ కారణంగా వస్తుందని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఇది గుండెపోటుకి సంకేతం కావచ్చు అలానే ఛాతి నొప్పి. గుండె నొప్పి వచ్చే ముందు ఛాతి నొప్పి కలుగుతుంది. దీనిని కూడా అసలు నిర్లక్ష్యం చేయకండి. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు శరీర ఎగువ భాగంలో కనపడే వివిధ రకాల నొప్పుల్లో ముఖ్యమైనది భుజాల నొప్పి భుజాలలో అకారణంగా నొప్పి వస్తున్నట్లు అయితే మాత్రం తేలికగా తీసుకోవద్దు. గుండెపోటుకి సంకేతం అవ్వచ్చు. మెడ నొప్పి కూడా హార్ట్ ఎటాక్ కి సంకేతం అవ్వచ్చు. హార్ట్ ఎటాక్ ప్రారంభ లక్షణాలలో మెడ నొప్పి కూడా ఒకటని చెప్పుకోవచ్చు ఈ లక్షణాలు కనుక వచ్చాయంటే అశ్రద్ధ చేయకండి వైద్యుడుని సంప్రదించడం మంచిది.

ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading