Home » BIG BOSSలోకి ఉదయభాను ఎవరితో కలిసి ఎంట్రీ ఇస్తుందో తెలుసా..?

BIG BOSSలోకి ఉదయభాను ఎవరితో కలిసి ఎంట్రీ ఇస్తుందో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఎంతటి ప్రాచుర్యం పొందిందో మనందరికీ తెలుసు. ఇప్పటికే తెలుగులో 6 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో, 7 సీజన్ కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ సీజన్ ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ప్రారంభమయ్య అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ షో ప్రారంభానికి రెండు నుంచి మూడు నెలల ముందు నుండే కంటెస్టెంట్స్ ఎంపిక జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. దీనిలో భాగంగానే షో నిర్వాహకులు ప్రస్తుతం కంటెస్టెంట్లు ఎంపికలు జరుగుతున్నారు. వందమందితో కూడిన జాబితా మొదట తయారుచేసి అందులోంచి 30 మందిని చివరికి ఎంపిక చేస్తారు.

alsoread:మృతి చెందిన పక్షులతో డ్రోన్ల తయారీపై పరిశోధనలు ఎందుకు చేస్తారో తెలుసా ?

Advertisement

తాజాగా అందిన సమాచారం ప్రకారం వందమందిలో ఇద్దరుగా ఉదయభాను మరియు ఆమె భర్త ఉన్నారట. మరి ఉదయభాను ఓకే చెబుతుందా లేదా అనే విషయం తెలియదు కానీ స్టార్ మా వర్గాల వారు మరియు షో నిర్వాహకులు ఉదయభాను దంపతులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో నిజం ఎంతుందో, అబద్ధం ఎంతుందో తెలియాల్సి ఉంది. గత మూడు ఏళ్లుగా ఉదయభాను బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం సాగుతోంది.

Advertisement

also read:రవితేజ హీరోగా ఎదగడానికి పరోక్షంగా ఆ హీరో కారణమయ్యాడా ?

అయితే ఆమె పిల్లలు చిన్న వాళ్ళ అవ్వడంతో వారిని విడిచిపెట్టి ఉదయభాను వెళ్లలేని పరిస్థితి ఇంతవరకు ఉండేది. ప్రస్తుతం వాళ్లు పెద్దయ్యారు. వారి పనులు వారే చూసుకోగలుగుతున్నారు. దీంతో ఉదయభాను బుల్లితెర మరియు వెండితెరపై కనిపించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈసారి తప్పకుండా ఉదయభాను ఎంట్రీ పక్కాగా ఉంటుందని, భావిస్తున్న తరుణంలో ఆమె భర్తని నిర్వాహకులు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో పూర్తి విషయాలు తెలియాలంటే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

also read:ప్రభాస్ సలార్ నుంచి క్రేజీ అప్డేట్.. అసలు కథ అదేనా ?

Visitors Are Also Reading