Home » మృతి చెందిన పక్షులతో డ్రోన్ల తయారీపై పరిశోధనలు ఎందుకు చేస్తారో తెలుసా ?

మృతి చెందిన పక్షులతో డ్రోన్ల తయారీపై పరిశోధనలు ఎందుకు చేస్తారో తెలుసా ?

by Anji
Ad

అమెరికాలో మరణించిన పక్షులతో కూడా విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నారు. వాటిని డ్రోన్ లుగా మార్చే ప్రక్రియపై కృషి చేస్తున్నారు. సాధారణ డ్రోన్ లకు హెలికాప్టర్ తరహాలో అమర్చిన రెక్కలు తిరగడం మనం చూసే ఉంటాం. తాజాగా పరిశోధకులు తయారు చేస్తున్న డ్రోన్ లకు పక్షిరెక్కలుంటాయి. వాటిని అల్లార్చుతూనే ఈ డ్రోన్ ఎగరాల్సి ఉంటుంది. వాస్తవానికి సజీవంగా ఉన్న ఓ పక్షి తన రెక్కల సహాయంతో సులభంగా గాలిలో ఎగురుతుంది. కానీ అదే విధానంలో డ్రోన్ ను ఎగరేయడం అసాధ్యం. 

Also Read :  ఫ్యాన్ వార్ : పవన్ కళ్యాణ్ అభిమానిని కొట్టి చ**పిన ప్రభాస్ ఫ్యాన్!

Advertisement

అమెరికాలోని న్యూ మెక్సికో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ టెక్నాలజీలో కొందరూ పరిశోధకులు నిరంతరం శ్రమిస్తున్నారు.  కొందరూ పరిశోధకులు ఇందుకోసం నిరంతరం శ్రమిస్తున్నారు. చనిపోయిన పక్షులను డ్రోన్ లుగా మార్చితే అది విమానాల అధ్యయనానికి సహాయపడుతుందని చెబుతున్నారు. దీంతో ఎంతో శక్తిని ఇంధనాన్ని ఆదా చేయవచ్చని భావిస్తున్నారు. తొలుత నీళ్లు కృతిమ, యాంత్రికంగా తయారు చేసిన పక్షులతో పరిశోధన చేశారు.   ఫలించకపోవడంతో నిజమైన పక్షుల శరీరాలపై దృష్టి పెట్టారు. ఈ ఆలోచన ఫలిస్తుందని వారు ధీమాగా ఉన్నారు.

Advertisement

Manam News

టాక్సిడెర్మీ పక్షులను శాస్త్రవేత్తలు పంజరంలో ఉంచారు.  పక్షి రెక్కలు కొట్టుకునే తీరు, ఎగిరే ఎత్త, వేగం అన్నింటిని అక్కడ రికార్డు చేస్తున్నారు. అదేవిధంగా పక్షి డ్రోన్ రంగులు, ఎగిరే సామర్థ్యంపై పరిశోధనలు చేస్తున్నారు. పక్షుల రంగులు వాటి సహచరులను ఆకర్షించడానికి, శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడుతాయనే అభిప్రాయముంది. డ్రోన్ ఎగిరే సామర్థ్యంలో రంగుల పాత్ర ఎంత వరకు ఉంటుందనే విషయంపై శాస్త్రవేత్తలు ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారు. ఇప్పుడు టాక్సిడెర్మీ అనే నమూనా పక్షులు సుమారు 20 నిమిషాలు ఎగరగలుగుతున్నాయి. 

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారికి వారం మధ్యలో ఓ సమస్క పరిష్కారం అవుతుంది

Visitors Are Also Reading