Home » రవితేజ హీరోగా ఎదగడానికి పరోక్షంగా ఆ హీరో కారణమయ్యాడా ?

రవితేజ హీరోగా ఎదగడానికి పరోక్షంగా ఆ హీరో కారణమయ్యాడా ?

by Anji
Ad

టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి సైడ్ క్యారెక్టర్ వేస్తూ.. మెల్లమెల్లగా హీరోగా ఎదిగాడు. హీరోగా కెరీర్ ప్రారంభం అవ్వడానికి ముందు చాలా సినిమాల్లో నటించాడు రవితేజ. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకపోవడంతో తనకు అంత త్వరగా అవకాశాలు రాలేదని.. అయినా కూడా పట్టు వదలకుండా ప్రయత్నించాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు.  

Also Read :   దసరా వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ స్థానంలో సాయి పల్లవి నటిస్తే ఎలా ఉండేదో తెలుసా ?

Advertisement

రవితేజ హీరోగా మారడం వెనుక అతనికీ తెలియకుండానే మరో హీరో ఉన్నాడనే విషయం చాలా లేటుగా బయటికొచ్చింది. ఆ హీరో మరెవ్వరో కాదండోయ్.. తొట్టెంపూడి వేణు. తెలిసి తెలియక వేణు వదిలేసిన ప్రాజెక్ట్ తోనే రవితేజ హీరోగా ఎదిగాడు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాను వేణు వదిలేశాడు. దర్శకుడు పూరిజగన్నాథ్ తొలుత ఈ సినిమాకి వేణు తప్ప మరో హీరో సెట్ కాడనుకున్నాడు. నిర్మాత అశ్వినిదత్ కి ఓ సినిమా చేసి పెడతానని వేణు ఇచ్చిన మాట కోసం ఆ సమయంలో పూరిజగన్నాథ్ కి డేట్స్ కేటాయించలేకపోయాడు. దీంతో పూరిజగన్నాథ్ రవితేజను సంప్రదించాడు. ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకోవడంతో అలా వీరి కాంబో సెట్ అయింది. ఇక  ఆ సినిమా సూపర్ హిట్ సాధించింది.  

Advertisement

Also Read :  నిర్మాత పరువు తీసిన సమంత… “చెవిలో వెంట్రుకలతో నువ్వు..” అంటూ సాలిడ్ కౌంటర్…!

Manam News

తొలుత శ్రీనువైట్ల దర్శకత్వంలో నీకోసం సినిమాలో రవితేజ హీరోగా నటించాడు. ఈ సినిమా మ్యూజికల్ గా హిట్ అయింది. గమ్మత్తైన విషయమేంటంటే.. ఈ సినిమాలోని పాటలన్నీ కూడా హీరో వేణు తన సొంత సినిమా కోసం చేయించుకున్నాడు. ఆర్పీ పట్నాయక్ సంగీత దర్శకత్వంలో సంగీతం చేయబడిన పాటలన్నీ పలు కారణాల వల్ల తన సినిమా క్యాన్సిల్ కావడంతో వేణు శ్రీను వైట్లకు ఇచ్చేశాడు.  కృష్ణవంశీ కూడా వేణు విషయంలో సహృదయ భావంతోనే ఉండేవాడట. ఖడ్గం సినిమాలో రవితేజ పాత్రను తొలుత వేణు దగ్గరికే తీసుకెళ్లాడు.కానీ కొన్ని కారణాల వల్ల వేణు ఆ సినిమాలో నటించకపోవడంతో తిరిగి రవితేజ వద్దకు చేరింది. దీంతో రవితేజ కెరీర్ లో మరోసారి సూపర్ హిట్ సాధించాడు. పలు కారణాల వల్ల వేణు వదులుకున్న సినిమాలను రవితేజ చేయడంతో తన కెరీర్ ను వేణు నిలబెట్టాడనే చెప్పవచ్చు. 

 Also Read :   టాలీవుడ్ లో కాకులే కీలకం.. అవి ఉంటే సినిమా హిట్టా ? 

Visitors Are Also Reading