Home » టాలీవుడ్ లో రైతుబిడ్డకి వరుస ఆఫర్లు.. ఏకంగా రామ్ చరణ్ సినిమాలోనే..? అదేంటంటే?

టాలీవుడ్ లో రైతుబిడ్డకి వరుస ఆఫర్లు.. ఏకంగా రామ్ చరణ్ సినిమాలోనే..? అదేంటంటే?

by Srilakshmi Bharathi
Ad

ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతూ వచ్చిన బిగ్ బాస్ ఏడవ సీజన్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచారు. అమర్ దీప్ ఈ షో కు రన్నర్ గా నిలిచారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన తరువాత.. వీరికి ఆడియన్స్ ఫుల్ జోష్ లో వెల్ కం చెప్పారు. రన్నర్ అప్ గా నిలిచినా అమర్ దీప్ కి ఎలాంటి అవకాశాలు వస్తాయో అన్న విషయాన్నీ పక్కన పెడితే.. విన్నర్ గా నిలిచినా రేవంత్ రెడ్డి కి మాత్రం చాలానే అవకాశాలు వచ్చేలా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని అవకాశాలు రైతు బిడ్డ తలుపు తట్టాయి కూడా.

Advertisement

ప్రస్తుతం టాలీవుడ్ లో స్లాంగ్ హంగామా నడుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ యాసలో నడుస్తున్న సినిమాలు చాలానే హిట్ అవుతున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయినా చాలా సినిమాలు అందుకు ఉదాహరణ. తెలంగాణ మాండలికాన్ని ప్రేక్షకులు గట్టిగానే ఆదరిస్తున్నారు. తెలంగాణా స్లాంగ్ అని కాదు.. ప్రేక్షకులకు కొంత కొత్తగా అనిపించే యాసలన్నీ సినిమాల్లో హిట్ పాయింట్స్ అవుతున్నాయి. అందుకే సినిమాల్లో ఇటువంటి వాటిని తెగ వాడేస్తున్నారు.

మెగాస్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో బుచ్చి బాబు డైరెక్షన్ లో ఇంకొక సినిమాను తీయనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన అర్జున్ అంబటి ఓ రోల్ కు ఫిక్స్ అయ్యారు. డైరెక్టర్ బుచ్చి బాబు ఇప్పటికే ఈ విషయాన్నీ స్టేజి పై చెప్పారు. అయితే.. ప్రశాంత్ ను కూడా ఓ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తీసుకోవాలి అని బుచ్చిబాబు ఆలోచనలో ఉన్నారట.  పవన్ కళ్యాణ్ ఉత్సాద్ భగత్ సింగ్ లో కూడా పల్లవి ప్రశాంత్ కు ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమోషనల్ సందర్భాల్లో ప్రజలతో కంటతడి పెట్టించడం పల్లవి ప్రశాంత్ కు బాగా వచ్చు. ఎమోషనల్ సన్నివేశాలను ప్రశాంత్ బాగా రక్తికట్టించగలరు. అందుకే ఆయనకు సినిమా ఛాన్స్ లు బాగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading