Home » క్రెడిట్ కార్డు వినియోగ‌దారులు ఈ జాగ్ర‌త్త‌ త‌ప్ప‌కుండా తీసుకోండి

క్రెడిట్ కార్డు వినియోగ‌దారులు ఈ జాగ్ర‌త్త‌ త‌ప్ప‌కుండా తీసుకోండి

by Anji
Ad

క్రెడిట్ కార్డులు వాడే వారు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. ఇష్టానుసారంగా కార్డును వారి గ‌డువులోపు చెల్లించ‌కుంటే ఇబ్బందుల‌కు గుర‌య్యే అవ‌కాశముంది. ఎందుకంటే వడ్డీ, ఇతర ఛార్జీలు అంటూ భారీగా దండుకున్నాయి బ్యాంకులు. అందుకే క్రెడిట్ కార్డులు పాడేవారు జాగ్రత్తలు పాటించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. గడువులోగా బిల్లును చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే అవకాశముంది. మీరు భవిష్యత్ లో రుణాలు తీసుకునే సమయంలో ఆ ప్రభావం చూపే ప్రమాదం ఉంది. క్రెడిట్ స్కోర్ తగ్గిపోతే ఏ బ్యాంకు నుంచి కూడా రుణం అందదు. దీంతో సమయానికి బిల్లు చెల్లిస్తూ సరిగ్గా వాడుకుంటే.. రుణాల విషయంలో ఎలాంటి ఇబ్బందులుండ‌వు. ఇలాంటి వారు కొన్ని విషయాల్లో తప్పకుండా తెలుసుకోవాల్సిందే.

Advertisement

రుణాలు తీసుకున్నవారు, క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నవారి క్రెడిట్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. క్రెడిట్ స్కోర్ అనేది రుణగ్రహీత క్రెడిట్ విలువ సూచిస్తుంది. రుణాలు తీసుకున్న వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా క్రెడిట్ స్కోర్ అందిస్తాయి. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే.. భవిష్యత్తులో తక్కువ రేట్లతో రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

క్రెడిట్ స్కోర్ ను ప్రభావితం చేసే అంశాలు

Advertisement

మీ క్రెడిట్ స్కోర్ ను ప్రభావితం చేసే అంశాల గురించి జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. రుణం లేదా క్రెడిట్ కార్డు బకాయిలు సమయానికి చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోర్ ను ప్రభావితం చేస్తుందనేది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ, మీ స్కోర్ ను ప్రభావితం చేసే అనేక ఇతర అంశాలు ఉన్నాయి. వాటిపై అందరికీ అవగాహన తక్కువగా ఉంటుంది. అవి ఏంటంటే.. వేరొకరి రుణానికి మీరు హామీ ఇవ్వడం, మీ రుణాన్ని పునర్నిర్మించడం వంటివి. అంతేకాకుండా కుటుంబ సభ్యులకు, బంధువులకు హామీ దారుగా ఉండటం సర్వసాధారణం. అయితే ఇలా తరచుగా చేయడం వలన తమ క్రెడిట్ స్కోర్ పై ప్రభావిత పడుతుందనే విషయం చాలా మందికి తెలియ‌దు. ఒకవేళ కొందరికి తెలిసినా.. పెద్దగా పట్టించుకోరు. అలాంటి వారికి భవిష్యత్తులో రుణాల విషయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా చేస్తే కొత్త రుణాల కోసం మీ సొంత అర్హత తగ్గడమే కాకుండా అసలు రుణగ్రహీత కు బకాయిలు ఉన్నట్లయితే మీరు కూడా నష్టపో వచ్చు. ఎంత మొత్తం ఖర్చు చేసినా.. సమయానికి బిల్లు చెల్లిస్తేనే మంచిది. లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వు.

Also Read : 

మ‌హేష్ చెప్పిన డైలాగ్ బ‌న్నిపై సెటైర్‌.. సోష‌ల్ మీడియాలో హాట్ టాఫిక్..!

పెద్ద సినిమాలు భారీ డిజాస్ట‌ర్లు కావ‌డానికి కార‌ణాలు ఇవేనా..?

 

Visitors Are Also Reading