Home » మ‌హేష్ చెప్పిన డైలాగ్ బ‌న్నిపై సెటైర్‌.. సోష‌ల్ మీడియాలో హాట్ టాఫిక్..!

మ‌హేష్ చెప్పిన డైలాగ్ బ‌న్నిపై సెటైర్‌.. సోష‌ల్ మీడియాలో హాట్ టాఫిక్..!

by Anji
Ad

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2వేల‌కు పైగా థియేట‌ర్ల‌లో నిన్న విడుదలైన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో మ‌హేష్ చెప్పిన ఓ డైలాగ్ హీరో బ‌న్నీ పై సెటైర్ అంటున్నారు. కొద్ది రోజులుగా మ‌హేష్ అల్లుఅర్జున్ అబిమానుల మ‌ధ్య వార్ న‌డుస్తోంది. స‌రిలేరు నీకెవ్వ‌రూ అలా వైకుంఠ‌పురంలో 2020 సంక్రాంతికి బ‌రిలో పోటీ ప‌డ్డాయి. థియేట‌ర్స్ స‌ర్దుబాటు విష‌యంలో ఇద్ద‌రు హీరోల మ‌ధ్య మ‌న‌స్పార్థాలు త‌లెత్తి.. పెద్దల పంచాయితీ వ‌ర‌కు వెళ్లింది. చివ‌రికి దిల్‌రాజు ఈ గొడ‌వ‌ను సెటిల్ చేశారు. స‌రిలేరు నీకెవ్వ‌రు అలా వైకుంఠ‌పురంలో మాది పెద్ద విజ‌యం అంటే మాది పెద్ద విజ‌య‌మంటూ పోస్ట‌ర్లు క‌లెక్ష‌న్స్ వార్ న‌డిచింది. అప్ప‌టి నుంచి మ‌హేష్‌, అల్లుఅర్జున్ ఫ్యాన్ ఈగోవార్ న‌డుస్తూనే ఉన్న‌ది.

ఈ త‌రుణంలోనే స‌ర్కారు వారి పాట సినిమాలో మ‌హేష్ చెప్పిన ఓ డైలాగ్ అల్లు అర్జున్ పై సెటైర్ అంటున్నారు. ఓ స‌న్నివేశంలో న‌టుడు సుబ్బ‌రాజు యాంకిల్ లెంత్ ఫ్యాంట్ ధ‌రించి మ‌హేష్ వ‌ద్ద‌కు వ‌స్తాడు. అదేంటి స‌గం ఫ్యాంట్ వేసుకున్నావు అంటాడు. ఇప్పుడు అదే స్టైల్ అని చెప్ప‌గానే మ‌హేష్ య‌ట‌కారంగా న‌వ్వుతాడు. మ‌హేష్ ఈ డైలాగ్ బ‌న్నీని ఉద్దేశించి చేశార‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ న‌డుస్తుంది. అలా వైకుంఠాపురం మూవీలో అల్లుఅర్జున్ యాంకిల్ లెంత్ ప్యాంట్స్ ధ‌రిస్తాడు. అయితే ఇదంతా నెటిజ‌న్ల ఊహ మాత్రమే. మ‌హేష్ ఈ విధంగా కూడా బ‌న్ని పేరు ప్ర‌స్తావించ‌కున్నా.. జ‌నాలు త‌మ‌కు తాము ఈ భావ‌న‌కు వ‌చ్చి కొత్త చ‌ర్చకు తెర‌లేపుతున్నారు.

Advertisement

Advertisement


మ‌రోవైపు స‌ర్కారు వారి పాట ఓపెనింగ్స్ ప‌రంగా రికార్డు వ‌సూల్లే రాబ‌ట్టింది. హైద‌రాబాద్ సిటీలో నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డు సొంతం చేసుకున్నా.. స‌ర్కారు వారి పాట నైజాంతో పాటు యూఎస్ లో భారీ వ‌సూలు చేసింద‌ని టాక్‌. స‌మాజంలో జ‌రుగుతున్న ఆర్థిక నేరాల‌ను ఉద్దేశిస్తూ.. ఓసెటెరిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కింది. మ‌హేస్ వ‌న్ మ్యాన్ షో గా అల‌రించింది. కీర్తి సురేష్ గ్లామ‌ర్‌, న‌ట‌న‌ సినిమాలో హైలెట్ అయింది. స‌ర్కారు వారి పాట సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందించారు.

Also Read : 

ఒకే ఏడాదిలో ఎక్కువ సినిమాలు విడుద‌లైన హీరోలు వీరే..!

“జబర్దస్త్” లోకి ఎంట్రీ ఇవ్వకముందు “హైపర్ ఆది” ఏ పని చేసేవారో తెలుసా ?

 

Visitors Are Also Reading