Home » పెద్ద సినిమాలు భారీ డిజాస్ట‌ర్లు కావ‌డానికి కార‌ణాలు ఇవేనా..?

పెద్ద సినిమాలు భారీ డిజాస్ట‌ర్లు కావ‌డానికి కార‌ణాలు ఇవేనా..?

by Anji
Ad

దర్శ‌కుడు కొర‌టాల శివ చేసిన సినిమాలు చాలా త‌క్కువ సినిమాలే అయినప్ప‌టికీ ఒక్క ఫ్లాప్ సినిమా లేకుండా ఉన్నాడు.  కానీ మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఆచార్య సినిమాతో భారీ డిజాస్ట‌ర్ చ‌విచూశాడు. సోలో, గీతా గోవిందం వంటి చిన్న సినిమాతోనే స‌క్సెస్ సాధించిన డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్. కానీ స‌ర్కారు వారి పాట వంటి పెద్ద సినిమాతో ప్లాఫ్ మూట గ‌ట్టుకున్నాడ‌నే టాక్ ఎక్కువ‌గా వినిపిస్తుంది.

Advertisement

క‌రోనా స‌మ‌యంలో క్ష‌ణం క్ష‌ణం ఉత్కంఠ‌తో సినిమా ఏవిధంగా పూర్త‌వుతుందోన‌ని టెన్ష‌న్ ప‌డేవారు. డైరెక్ట‌ర్లు ప్రొడ‌క్ష‌న్ టీమ్‌లో అడుగడ‌గునా ఇబ్బందులు ఎదుర్కున్నారు. క‌రోనా కార‌ణంగా సినిమా షూటింగ్‌లు కూడా అనుకున్న స‌మ‌యానికి పూర్తి కాలేక‌పోయాయి. అనుకున్న స‌మ‌యానికి సినిమా వ‌స్తే.. ఆ ప్లేవ‌ర్ మ‌రోలా ఉంటుంది. లేటు అయ్యే కొద్ది ఆ ప్లేవ‌ర్ మిస్ అవుతుంటుంది. ఆల‌స్యం అయ్యే అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయా సినిమాల ప్లాఫ్ వెనుక ఇదే ప్ర‌ధాన కార‌ణం అని సినీ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

Advertisement

వాస్త‌వానికిఈ సినిమాల‌ను థియేట‌ర్ల‌లోకి తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ ప‌డిన క‌ష్టం అంతా ఇంతా కాదు. ఓ ప‌క్కా లీకులు, మ‌రోప‌క్క నెగిటివ్ ప్ర‌చారాలు ఇలా అన్నింటిని త‌ట్టుకుని ఎట్ట‌కేల‌కు భారీ అంచ‌నాల‌తో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చినా సినిమాలు ఇవి. కానీ ప‌డిన క‌ష్టం పూర్తిగా వృథాగానే మిగిలిపోయింది. సింపుల్‌గా ప్రేక్ష‌కులు తిర‌స్క‌రించారు. ఇవ‌న్ని ఓ ఎత్త‌యితే.. డిజాస్ట‌ర్ హ్యాష్ ట్యాగ్‌ల‌తో సోష‌ల్ మీడియాల‌తో ట్రెండింగ్‌ల విష‌యంలో దుర‌దృష్ట‌క‌ర‌మ‌నే చెప్పాలి.

Also Read : 

మ‌హేష్ చెప్పిన డైలాగ్ బ‌న్నిపై సెటైర్‌.. సోష‌ల్ మీడియాలో హాట్ టాఫిక్..!

ఒకే ఏడాదిలో ఎక్కువ సినిమాలు విడుద‌లైన హీరోలు వీరే..!

 

Visitors Are Also Reading