Home » లోక్ సభలో 543 సీట్లు.. 544 స్థానాలకు ఈసీ షెడ్యూల్.. ఎందుకో తెలుసా ?

లోక్ సభలో 543 సీట్లు.. 544 స్థానాలకు ఈసీ షెడ్యూల్.. ఎందుకో తెలుసా ?

by Anji
Ad

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా  కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 7 దశల్లో దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా తొలిదశ 19న జరగనుండగా.. 7వ దశ జూన్ 01న జరుగనుంది. మే 13 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దేశవ్యాపత్ంగా 543 స్థానాలుండగా.. ఈసీ మాత్రం 544 స్థానాలకు షెడ్యూల్ ప్రకటించింది.

Advertisement

దీంతో ఇది చూసిన వారికి కాస్త గందరగోళంగా అనిపించింది. ఈశాన్య రాష్ట్రంలో ఒక పార్లమెంట్ స్థానానికి రెండు దశల్లో పోలింగ్ జరగడమే ఇందుకు కారణం. ఈసీ శనివారం ప్రకటించిన లోక్ సభ షెడ్యూల్ లో మొత్తం 544 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. కొత్తగా మరో పార్లమెంట్ స్థానం చేరలేదండోయ్.. అలా అని తప్పుగా ప్రకటించలేదు కూడా. ఈ విషయం పై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ని మీడియా ప్రశ్నించగా.. వివరణ ఇచ్చారు. ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఇక్కడ రెండు దఫాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

మణిపూర్ లో ఇన్నర్, ఔటర్ మణిపూర్ లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో ఏప్రిల్ 19, 26 తేదీలలో అక్కడ పోలింగ్ జరుగనుంది. ఇన్నర్ మణిపూర్ తో పాటు ఔటర్ మణిపూర్ కి చెందిన పలు సెగ్మెంట్లలో తొలి, రెండో దశలో పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలో ఇటీవల నెలకొన్న ఘర్షణల కారణంగా అక్కడ పోలింగ్ ఇలా నిర్వహించనున్నట్టు వెల్లడించింది ఈసీ.

Also Read :  బీజేపీ అంటే బాబు, జగన్, పవన్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Visitors Are Also Reading