Home » భోజనానికి ముందు బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

భోజనానికి ముందు బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

భారతదేశంలో కరోనా తరువాత బాదం పప్పుల వినియోగం బాగా పెరిగింది. కరోనా నుంచి రక్షణ కోసం పోషకాహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచించడంతో చాలా మంది డ్రైప్రూట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా బాదంపప్పు కచ్చితంగా రోజు వారి డైట్ లో చేర్చుకున్నారు. కరోనా సమయంలో బాదం ఉపయోగాలు తెలుసుకున్న వారు బాదం పప్పును డైలీ తింటూనే ఉన్నారు. బాదం పప్పు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం. 

Also Read :  ఇలా చేస్తే ఈగలు పరార్ కావడం పక్కా..!

Advertisement

ప్రధానంగా బాదం పప్పును భోజనానికి ముందు తింటే చాలా అద్భుతమైన ప్రయోజనాలుంటాయిన తేలింది. భోజనానికి 30 నిమిషాల ముందు దాదాపు 20 గ్రాములు బాదం పప్పు తింటే పోస్ట్ ప్రాండియల్ హైపర్ గ్లైసేమియా లేదా గ్లూకోజ్ స్పైక్ గణనీయం తగ్గుతుందని వెల్లడి అయింది. అదేవిధంగా ఇన్సులిన్ స్థాయిలు కూడా మెరుగుపడ్డాయి. ప్రీడయాబెటిస్ ఉన్నవారు బాదం పప్పు తినడం వల్ల ప్రయోజనకరమైన ప్రభావాలను పొందుతారని నివేదికలో వెల్లడి అయింది. సాధారణంగా రోజుకు 5 నుంచి 6 వరకు బాదం పప్పులను తింటుంటారు. ఇది మానవ శరీరానికి చాలా తక్కువ అని నిపునులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన మనిషి రోజుకు 20 గ్రాముల బాదం పప్పు తినాలని పేర్కొంటున్నారు. రోజుకు 15 నుంచి 18 వరకు బాదం పప్పులను తీసుకోవాలి. 

Advertisement

Also Read :  వేగంగా బరువు తగ్గించుకోవాలంటే ఈ టీ నెలరోజులు తాగితే చాలు..!

Manam News

ఈ అధ్యయనం కోసం దాదాపు 27 మంది పురుషులు, 33 మంది స్త్రీలను ఎంపిక చేసుకొని పరీక్షలు నిర్వహించారు. మధుమేహం, తీవ్రమైన అంటు వ్యాధులు, ఫ్యాంక్రియాటైటిస్ చరిత్ర, మూత్రపిండ కాలేయ వ్యాధి, అనియంత్రిత రక్తపోటు, హైపోథైరాయిడిజం వంటివి అధ్యయనం నుంచి మినహాయించినట్టు పరిశోధకులు వెల్లడించారు. బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలు 30, 60, 90, 120 నిమిషాలకు ప్రీ మీల్ ఆల్మండ్ లోడ్ ట్రీట్ మెంట్ డైట్ వర్సెస్ కంట్రోల్ డైట్ కి గణనీయం తక్కువగా ఉందని అధ్యయనంలో వెల్లడి అయింది. బాదం పప్పులోని పైబర్ పేగుల్లో స్థిరత్వాన్ని పెంచుతుంది. అదేవిధంగా గ్లూకోజ్ వ్యాప్తిని కూడా అరికడుతుంది. ఇన్సులిన్, సెన్సిటివిటిని పెంచుతుందని పరిశోధనలో వెల్లడి అయింది.  

Also Read :  దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి..!

Visitors Are Also Reading