Home » దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి..!

దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి..!

by Anji
Ad

భారతదేశంలో హిందువులు ఒక్కొక్క రోజు ఒక్కో దేవుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. వాస్తు శాస్త్రాల్లో వారంలో ఏ రోజు ఏ దేవుడిని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిదంగా దేవుడిని ఎలా పూజించాలి. దేవుడికి ఇష్టమైన నైవేద్యాలు ఫహారాలు ఏమిటి అనే విషయాలను వివరించిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. మనలో దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు చాలా మంది కొన్ని పొరపాట్లను చేస్తుంటారు. తెలిసి తెలియక చేసి కొన్ని పొరపాట్ల వల్ల మనం పలు రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నైవేద్యం విషయంలో ఎలాంటి విషయాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :   తారకరత్న గురించి అలేఖ్య చేసిన పోస్ట్ చూస్తే బాధపడకుండా ఉండరు..!

Advertisement

Advertisement

దేవుళ్లు మనం పెట్టిన నైవేద్యాన్ని స్వీకరిస్తాడని భావిస్తారు. ఒక్కో దేవుడికి ఒక్కో ప్రసాదాన్ని పెడుతుంటాం. నైవేద్యాన్ని సమర్పించే సమయంలో కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఆ సమయంలో తప్పులు చేస్తే దేవుడి నిరాదరణకు గురవుతారు. కొంత మంది దేవుడికి నైవేద్యం సమర్పించిన వెంటనే తీసేస్తూ ఉంటారు. అలా చేయకూడదు కొద్ది సేపు దేవుడి దగ్గర వదిలేసి ఆ తరువాత ప్రసాదాన్ని తీసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. దేవుడికి తయారు చేసే పదార్థాలను నూనెతో తయారు చేయకూడదు.

Also Read :  ప్రియుడి కోసం మొద‌ట భ‌ర్త‌ను త‌ర‌వాత త‌మ్ముడిని..ఈ లేడీ మామూలు ఖిలేడీ కాదు..!

Manam News

కేవలం నెయ్యితో మాత్రమే చేసిన ప్రసాదాలను మాత్రమే దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. అదేవిధంగా నైవేద్యం కోసం కేవలం నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. అలాగే మిరపకాయలతో చేసిన పదార్థాలను దేవుడికి అస్సలు సమర్పించకూడదు. వండిన ఆహారాన్ని మాత్రమే దేవుడికి సమర్పించాలి. ఆ తరువాత మీరు ప్రసాదాన్ని స్వీకరించాలి. అంతకంటే ముందు ఆ ప్రసాదాన్ని ఆవుకు పెట్టాలి. ఆవుకి నైవేద్యంగా పెట్టిన తరువాత మీరు తింటే దేవతలు చాలా సంతోషిస్తారు. 

Also Read :  ఉగాది రోజు గుమ్మానికి ఇది కడితే ఈ ఏడాది అంతా ధనానికి లోటుండదు..!

Visitors Are Also Reading