Home » IND Vs WI : మూడో టీ-20 మ్యాచ్‌కు కోహ్లీ, పంత్ దూరం

IND Vs WI : మూడో టీ-20 మ్యాచ్‌కు కోహ్లీ, పంత్ దూరం

by Anji
Ad

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీప‌ర్ కు రిష‌బ్ పంత్‌కు వెస్టిండిస్‌తో జ‌ర‌గాల్సిన మూడ‌వ టీ-20 మ్యాచ్‌కు దూరం కానున్నారు. వారిద్ద‌రికీ బ‌యోబ‌బుల్ నుంచి ప‌ది రోజుల పాటు విరామం ఇవ్వ‌నున్న‌ట్టు ఓ బోర్డు అధికారి వెల్ల‌డించారు. విరాట్ త‌న ఇంటికి వెళ్లిపోయిన‌ట్టు పేర్కొన్నారు. దీంతో పంత్, కోహ్లీ వ‌చ్చే వారం శ్రీ‌లంక‌తో జ‌ర‌గ‌బోయే మూడు టీ-20ల సిరీస్‌కు దూరం కానున్నారు. మార్చి 04 నుంచి మొహాలి వేదిక‌గా జ‌ర‌గ‌బోయే రెండు టెస్ట్‌ల సిరీస్‌కు తిరిగి జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నారు.

Also Read :  Ranji Trophy 2022: ఫ‌స్ట్ క్లాస్ ఆరంగేట్రంలో స‌కీబుల్ ప్ర‌పంచ రికార్డు.. ఈ జాబితాలో ఇంకా ఎవ‌రున్నారంటే..?

Advertisement


శ‌నివారం ఉద‌యం కోహ్లీ ఇంటికి వెళ్లాడు. బీసీసీఐ అత‌నికి విశ్రాంతి క‌ల్పించింది. ఎక్కువ ప‌ని భారం ఉండ‌డం, ప్లేయ‌ర్ల మాన‌సిక ఆరోగ్యం కోసం అన్ని ఫార్మాట్ల ఆట‌గాళ్ల‌కు ఇలాంటి విరామాన్ని బోర్డు ఇస్తుంటుంది. కోహ్లీ గ‌త డిసెంబ‌ర్ నుంచి టీమిండియాతోనే ప్ర‌యాణిస్తున్నాడు. ద‌క్షిణాప్రికా ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ మూడు టెస్ట్‌లు, మూడు వ‌న్డేలు ఆడ‌గా.. విరాట్ రెండు టెస్ట్‌ల్లో మిన‌హా అన్ని మ్యాచ్‌ల‌ను ఆడాడు. ప్ర‌స్తుం విండిస్‌తో జ‌రుగుతున్న సిరీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు మూడు వ‌న్డేలు, రెండు టీ-20ల‌లో ఆడాడు. వ‌చ్చె నెల శ్రీ‌లంక‌తో జ‌రిగే తొలి టెస్ట్ కోహ్లీకి 100వ మ్యాచ్ కావ‌డం వ‌ల్ల అందుకు ప్ర‌త్యేకంగా స‌న్న‌ద్ధం అవ్వాల‌ని భావిస్తున్నాడు. ఈ త‌రుణంలోనే కీల‌క టెస్ట్‌కు ముందు అత‌నికి విశ్రాంతినిచ్చింది బోర్డు.

Advertisement

విండిస్‌తో జ‌రిగిన రెండ‌వ టీ-20లో టీమిండియా విజ‌యం సాధించి మ‌రొక మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 8 ప‌రుగుల తేడాతో భార‌త్ గెలుపొందింది. కోహ్లీ (52), పంత్ (52) స‌మానంగా స్కోర్ చేయ‌డం విశేషం. మ‌రొక వైపు ఇద్ద‌రికీ ఒకేసారి విశ్రాంతినివ్వ‌డం మ‌రొక విశేష‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఈనెల 24న భార‌త్‌-శ్రీ‌లంక సిరీస్ ప్రారంభం అవ్వ‌నుంది. తొలి మ్యాచ్‌కు ల‌క్నో ఆతిథ్య‌మివ్వ‌నున్న‌ది. ఆ త‌రువాత రెండు మ్యాచ్‌లు ధ‌ర్మ‌శాల‌లో జ‌ర‌గ‌నున్నాయి. అనంత‌రం మార్చి 4-8 మొహ‌లీలో తొలి టెస్ట్, మార్చి 12-16 వ‌ర‌కు బెంగ‌ళూరులో రెండవ టెస్ట్ బీసీసీఐ నిర్వ‌హిస్తుంది.

Also Read :  భార‌త్‌కు అరుదైన గౌర‌వం.. 2023లో ఇండియాలోనే అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ సెషన్

Visitors Are Also Reading