Home » భార‌త్‌కు అరుదైన గౌర‌వం.. 2023లో ఇండియాలోనే అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ సెషన్

భార‌త్‌కు అరుదైన గౌర‌వం.. 2023లో ఇండియాలోనే అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ సెషన్

by Anji
Ad

వ‌చ్చే సంవ‌త్స‌రం ముంబ‌యిలో అంత‌ర్జాతీయ ఒలంపిక్స్ క‌మిటీ 2023 సెష‌న్ నిర్వ‌హించేందుకు భార‌త్ హ‌క్కులు ద‌క్కించుకుంది. దీంతో 40 ఏండ్ల త‌రువాత భార‌త‌దేశానికి ఆ గౌర‌వం ల‌భించింది. 1983లో చివ‌రిసారిగా ఢిల్లీలో ఈఐఓసీ సెష‌న్ నిర్వ‌హించారు. ఆ త‌రువాత మ‌ర‌ల 2023లో అంటే దాదాపు 40 సంవ‌త్స‌రాల‌కు భార‌త్ ఆ విశిష్ట స‌మావేశానికి ఆతిథ్యం ఇవ్వ‌నున్న‌ది.

Also Read :  పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఎవ‌ర‌నేది ఉత్కంఠ‌.. ఆ ప్లేయర్‌ని ఎన్నుకుంటే జీరో నుంచి ప్రయాణించాల్సిందే..!

Advertisement

 

 

ప్ర‌స్తుతం బీజింగ్‌లో జ‌రుగుతున్న 139వ ఐఓసీ సెష‌న్‌లో భార‌త బృందం ఈ మేర‌కు అంత‌ర్జాతీయ ఒలింపిక్స్ క‌మిటీ సభ్యుల‌కు ఓ ప్రెజెంటేష‌న్ ఇచ్చి ఒప్పించింది. ఇందులో 2008 ఒలింపిక్స్ బంగారు ప‌త‌క విజేత అభిన‌వ్ బింద్రాతో పాటు ఐఓసీ స‌భ్యురాలు నీతా అంబానీ, భార‌త ఒలింపిక్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు న‌రింద‌ర్ బాట్రా, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు.

Advertisement

ఈ విష‌యం ప‌ట్ల ఐఓసీ స‌భ్యురాలు, రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ చైర్ ప‌ర్స‌న్ నీతా అంబానీ హ‌ర్షం వ్య‌క్తం చేసారు. 40 ఏండ్ల త‌రువాత భార‌త్‌కు అంత‌ర్జాతీయ ఒలింపిక్స్ క‌మిటీ స‌మావేశం నిర్వ‌హించే అదృష్టం ద‌క్కింద‌ని.. దీంతో భార‌త్‌లోని యువ‌త ఈ ఒలంపిక్స్ విశేషాల‌ను తెలుసుకునేందుకు చ‌క్క‌టి అవ‌కాశం ల‌భించింద‌ని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో భార‌త‌దేశంలో ఒలంపిక్స్ క్రీడ‌లు నిర్వ‌హించ‌డం మ‌న క‌ల అని ఆమె తెలిపారు.

Also Read :  వేణు మాద‌వ్ సినిమాలతో ఎంత‌ సంపాదించారు..?ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది..!

Visitors Are Also Reading