Home » బీసీసీఐ ఎన్నికల ప్రకటన వచ్చేసింది..!

బీసీసీఐ ఎన్నికల ప్రకటన వచ్చేసింది..!

by Azhar
Ad
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా గుర్తింపును తెచ్చుకున్నా బీసీసీఐకి ఇప్పుడు ఎన్నికల సమయం అనేది వచ్చేసింది. అయితే బీసీసీఐలోని అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్  పదవులకు ఎన్నికలు జరగనున్నాయి.ప్రస్తుతం  అధ్యక్షుడుగా గంగూలీ ఉన్న విషయం తెల్సిందే. కానీ ఈ ఎన్నికల్లో ఆ పదవిలో ఇప్పుడు సెక్రటరీ అయిన హోమ్ మంత్రి అమిత్ షా కొడుకు ఎన్నిక కానున్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ మధ్యే గంగూలీ, జై షా సుప్రీం కోరు వరకు వెళ్లి బీసీసీఐలో ఉన్న కూలింగ్ పిరియడ్ ను రాదు చేయించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా మళ్ళీ వారు ఇద్దరు ఎన్నికలో నిలుచునే అవకాశం అనేది వచ్చింది. కానీ ఇప్పుడు గంగూలీ కంటే జై షాకే ప్రెసిడెంట్ అయ్యే ఆవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని తెలుస్తుంది. చాలా రాష్ట్రబోర్డులు అన్ని జై షాకే మద్దతుగా ఉన్నట్లు తెలుస్తుంది.
రేపటి నుండి అక్టోబర్ 4 వరకు నామినేషన్లను వేయవచ్చు. ఇక అక్టోబర్ 13 వరకు వాటిని  పరిశీలించి చెల్లుబాటు, క్యాన్సల్ అయ్యే అయ్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. ఇక ఆ మరుసటి రోజు అభ్యర్థులకు తమ నామినేషన్లను వెన్నకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక 15న పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. అయితే ఈ బీసీసీఐ ఎన్నికలు వచ్చే నెల 18న జరగనున్నాయి. ఇక అదే రోజు ఫలితాలు కూడా విడుదల చేస్తారు.

Advertisement

Visitors Are Also Reading