Home » సలార్ కు తప్పని లీకుల సమస్య.. మరో లుక్ లీక్..!

సలార్ కు తప్పని లీకుల సమస్య.. మరో లుక్ లీక్..!

by Azhar
Ad

ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియా సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ షూటింగ్ అనేది పూర్తికాగా.. ప్రస్తుతం సలార్ లాగే ప్రాజెక్ట్ కే సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. కానీ వీటిలో ఏ సినిమా నుండి కూడా ఫ్యాన్స్ కోసం అప్డేట్ అనేది వచ్చింది లేదు. కానీ కొంతమంది లీకర్స్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నారు.

Advertisement

ఈ మధ్యే కాలంలో ప్రభాస్ సినిమా నుండి అధికారికంగా వచ్చిన అప్డేట్స్ కంటే లీకుల ద్వారానే ఎక్కువ వచ్చాయి. అందులోనూ ముఖ్యంగా సలార్ సినిమా నుండి ఈ లీకులు అనేవి ఎక్కువ అవుతున్నాయి. గతంలో చాలా సార్లు ప్రభాస్ యొక్క లుక్స్ అనేవి ఈ సినిమా నుండి వచ్చాయి. ఇక ఇప్పుడు మరోసారి కూడా సలార్ సినిమా నుండి ప్రభాస్ కొత్త లీక్ అనేది లీక్ అయ్యింది.

Advertisement

అందులో ప్రభాస్ తన షర్ట్ ను దాదాపు భుజాల వద్దకు మలిచి ముందునా వారిని సీరియస్ గా చూస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కెజిఎఫ్ దర్శకుడు అయిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సలార్ సినిమాపై అంచనాలు అనేవి భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గిన విధంగానే కథను కూడా బాగా సాలిడ్ గా సిద్ధం చేసుకున్నాడు ప్రశాంత్ నీల్.

ఇవి కూడా చదవండి :

భువీపై రోహిత్ కు నమ్మకం లేదు.. అందుకే విఫలం..?

రోహిత్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన ధోని..!

Visitors Are Also Reading