Home » అప్పుడే నా కెరియర్ ముగిసేది అంటున్న అశ్విన్..!

అప్పుడే నా కెరియర్ ముగిసేది అంటున్న అశ్విన్..!

by Azhar
Ad

భారత జట్టులో సీనియర్ స్పిన్నర్ గా రవిచంద్రన్ ఆశ్సిన్ కొనసాగుతున్నాడు. అయితే దాదాపు మూడేళ్లు పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఇండియాకు దూరంగా ఉన్న అశ్విన్.. గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ నుండి మళ్లీ ఎంట్రీ అనేది ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో కూడా అశ్విన్ ఆడుతున్నాడు.

Advertisement

అయితే ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ లో ఇండియా జట్టు పాకిస్థాన్ తో తలపడింది. ఇక ఈ మ్యాచ్ లో ఇండియాకు ఆఖరి బంతికి రెండు పరుగులు కావాల్సిన సమయంలో క్రీజులోకి వచ్చాడు అశ్విన్. అయితే ఆ బంతిని ఎదుర్కొన అశ్విన్ తెలివిగా అలోచించి లైన్ లోపలికి జరగడంతో అది వైడ్ అయ్యింది. అందువల్ల ఇండియాకు విజయం సులువైంది. కానీ ఒకవేళ అది వైడ్ కాకపోతే.. మీ ప్యాడ్ ను తాకి ఉంటె ఏం చేసేవాడిని అని అశ్విన్ కు తాజా ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది.

Advertisement

ఇక దీనికి సమాధానం ఇచ్చిన అశ్విన్.. నన్ను చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఒకవేళ అది వైడ్ కాకపోతే క్రికెటర్ గా నా కెరియర్ అక్కడే ముగిసిపోయేది అని కామెంట్ చేసాడు. అయితే క్రికెట్ రూల్స్ పైన మన ఇండియా జట్టులో అందరికంటే అశ్విన్ కు ఎక్కువ పటు అనేది ఉంటుంది అనే విషయం అందరికి తెలుసు. అలాగే అశ్విన్ సమయానికి తగ్గినట్లు ఆలోచిస్తాడు అని కోహ్లీ కూడా చెప్పాడు.

ఇవి కూడా చదవండి :

ఇలాంటి రూల్ క్రికెట్ లో ఉండాలా..?

బాబర్ ఆజాం కొత్త జాబ్ అదేనా..?

Visitors Are Also Reading