Home » ఇలాంటి రూల్ క్రికెట్ లో ఉండాలా..?

ఇలాంటి రూల్ క్రికెట్ లో ఉండాలా..?

by Azhar

ప్రపంచ వ్యాప్తంగా ప్రజాధారణ పొందిన ఆటల్లో క్రికెట్ కూడా ఒక్కటి అనేది అందరికి తెలిసిందే. ఇక ఈ క్రికెట్ ను కంట్రోల్ చేసే ఐసీసీ ఇందులో ఎలాంటి తప్పులు జరగకుండా చాల నియమాలను పెట్టింది. ఇక ఈ రూల్స్ విషయంలో ఐసీసీ చాలా కఠినంగా కూడా ఉంటుంది అనేది అందరికి తెలుసు. అయితే తాజాగా జరుగుతున్న ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ 5 పరుగులను దక్షిణాఫ్రికాను సమర్పించుకుంది.

అయితే ఈ మ్యాచ్ 11వ ఓవర్ లో బౌలర్ బాల్ ను రిలీజ్ చేయడానికంటే ముందే బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముందుకు కదిలాడు. దాంతో అంపైర్ సౌత్ ఆఫ్రికాకు 5 పరుగులను పెనాల్టీగా ఇచ్చాడు. అయితే క్రికెట్ నియమాల ప్రకారం బౌలర్ బంతిని రిలీజ్ చేయడానికంటే ముందే కీపర్ కదలకూడదు. ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండాలి. అలా లేకపోతే దానిని తప్పుగా పరిగణిస్తారు.

అయితే బ్యాటర్ ముందు ఉన్న ఫీల్డర్ బంతిని వేయడానికంటే ముందే కదిలితే.. అది బ్యాటర్ ఏకాగ్రతను దెబ్బ తీస్తుంది అని ఐసీసీ భావించి.. అలా చేయకూడదు అని నియమం పెట్టింది. కానీ బ్యాటర్ వెనక్కి ఉండే కీపర్ కదిలితే ఎవరికీ ఏ సమస్య అనేది మాత్రం తెలియదు. ఇలాంటి నియమాలు క్రికెట్ లో ఉండాలా వద్దా అనేది కూడా చర్చ నడుస్తుంది. ఈ మ్యాచ్ రూల్స్ లో చాలా మార్పులు చేసిన ఐసీసీ.. ఈ రూల్ ను కూడా పరిశీలించాలని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి :

నోబాల్ వివాదం… పాక్ నోరు మూయిస్తున్న భారత్ ఫ్యాన్స్..!

బీసీసీఐతో పటు క్యాబ్ నుండి కూడా దాదా ఔట్..!

Visitors Are Also Reading