Home » Health care : మైదాతో చేసినా ఆహార పదార్థాలు ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ సమస్యలు మీలో ఖచ్చితంగా ఉన్నట్లే..!

Health care : మైదాతో చేసినా ఆహార పదార్థాలు ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ సమస్యలు మీలో ఖచ్చితంగా ఉన్నట్లే..!

by Mounika
Ad

Health care : ఈ రోజుల్లో మైదా వాడకం అనేది బాగా పెరిగింది. మార్కెట్లో ఏ ఆహార పదార్థాలు కొనాలన్నా వాటిలో మైదా పిండిలేనిది తినుబండారాలను తయారు చేయడం లేదు. బిస్కెట్లు, బ్రెడ్డు, సమోసా, రోల్స్‌, పిజ్జా, బర్గర్‌, మంచూరియా ఇలా ఏ ఆహార పదార్ధమైన సరే మైదాని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మైదాని గోధుమ పిండిని బాగా శుద్ధి చేసి తయారు చేస్తారు. ఆ వచ్చిన మైదాపిండిలో ఎలాంటి పోషక విలువలు ఉండవు. పైపెచ్చు మైదాలో కేలరీలు అధికంగా ఉంటాయి.

Health care

Advertisement

గోధమ పిండిలో విటమిన్లు, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, మాంగనీస్‌, ఫైబర్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే రిఫైన్‌ చేసిన పిండిలో ఈ పోషకాలు శూన్యం అని చెప్పాలి. అంతేకాకుండా మైదాలో ఫైబర్‌ కంటెంట్‌ కూడా సున్నా ఉంటుంది. అలా ఎలాంటి పోషకాలు లేని మైదాపిండితో తయారు చేసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.​

Advertisement

మైదాలో అలోక్సాన్ పుష్కలంగా ఉండటం వలన డయాబెటిస్‌ను సమస్యలు తలెత్తుతాయి. మైదాలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కూడా తక్కువగా ఉండడం చేత రక్తంలో చక్కర స్థాయిని పెంచుతుంది. తద్వారా శరీరంలోఇన్సులిన్‌ స్థాయిలో పెరిగి డయాబెటిస్‌ బారిన పడే అవకాశాలను ఎక్కువ చేస్తుంది. అంతేకాకుండా మైదాని తరచుగా ఆహార పదార్థాలు ఉపయోగించడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే మైదాలో ఫైబర్‌ కంటెంట్‌ ఉండదు. ఇది జీర్ణవ్యవస్థను మందగించేలా చేస్తుంది . అందువలన మైదాని ఎక్కువగా తీసుకునేవారులో మలబద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుంది.

మైదా శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను పెంచి అధిక బరువు పెరగడానికి దారితీస్తుంది. అలాగే రుతుక్రమ సమస్యలను కూడా మైదాతో తయారు చేసిన ఆహారాలు తినేవారు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. మైదా తయారీలో బెంజాయిక్ యాసిడ్, సోడియం మెటా బిసల్ఫేట్ అనే ప్రమాదక రసాయనాలు వినియోగిస్తారు. ఈ కెమికల్స్‌ గర్భిణీ స్త్రీలు, చిన్నారులకు హానికరమని నిపుణులు సూచిస్తున్నారు. వీలైనంతవరకు ఆహార పదార్థాలలో మైదాను ఉపయోగించడం శ్రేయస్కారం కాదని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :

ఆస్పిరిన్ మాత్రలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

పిల్లలు మట్టి, బలపాలు తింటున్నారా..? వారు ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..?

Health Tips: అన్నం తిన్న తరువాత ఈ పొరపాట్లను అస్సలు చెయ్యకండి.. ఎందుకంటే?

 

Visitors Are Also Reading