Home » ఆస్పిరిన్ మాత్రలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

ఆస్పిరిన్ మాత్రలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

by Mounika
Ad

ఆస్పిరిన్ ఈ మాత్ర పేరు అనేకమంది వినే ఉంటారు. ఈ మాత్రని ఎక్కువగా  తలనొప్పి, జలుబు, కాళ్ల బెణుకులు, కీళ్ల నొప్పులు, మైగ్రేన్, రుతుసమయంలో వచ్చే తిమ్మిరి నొప్పి వంటి వాటికి ఆస్పిరిన్ బాగా పనిచేస్తుంది. అయితే తాజాగా జరిగిన అధ్యయనం ప్రకారం, ఆస్పిరిన్‌ను తీసుకోవడం వల్ల మెదడులో రక్తస్రావం పెరుగుతుందని వెళ్లడైంది.యునైటెడ్ స్టేట్స్లో జరిగిన అధ్యయనం ప్రకారం 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు 19,144 మంది వృద్ధులపై 5 ఏళ్ల పాటు ఆస్పిరిన్ టాబ్లెట్లు ఉపయోగించడం వల్ల వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే దానిపై పరిశోధనలు జరిపారు .

aspirin

Advertisement

పరిశోధకులు స్టడీ ప్రకారం.. వారిలో సగం మందికి రోజూ తక్కువ మోతాదులో ఆస్పిరిన్ ఇవ్వడం జరిగింది. మరికొందరికి ప్లేసిబో అనే మరో మందుని ఇచ్చారు. ఆ తర్వాత రెండు రకాల మాత్రలు తీసుకున్న వారిలో వచ్చే సత్ఫలితాలు మరియు దుష్ఫలితాలను రికార్డ్ చేసిన డేటాను పరిశీలించారు.   ఆస్పిరిన్ మాత్రలు తీసుకున్న వారిలో స్ట్రోక్‌కు ప్రమాదం తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇక ఈ అధ్యాయం ద్వారా పరిశోధకులు ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల మెదడులో రక్తం పలుచగా మారి రక్తస్రావం పెరగడానికి కారణమవుతుందని వెళ్లడయ్యింది.

Advertisement

ఆస్పిరిన్ తీసుకోవాలని భావించేవారు, ముందుగా డాక్టర్లని సంప్రదించి మీకు ఎంత మోతాదు అవసరమవుతుందో సరైన సూచనలు తీసుకోవడం ఉత్తమం. డాక్టర్లు సూచించిన మోతాదు ప్రకారం ఆస్పిరిన్ తీసుకోవాలి. సాధారణంగా ఆస్పిరిన్ మాత్రలను ఎక్కువగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, నొప్పి నివారణకు వైద్యులు  సూచిస్తారు. కీళ్ల నొప్పి, తలనొప్పి, పంటి నొప్పి, జ్వరం తగ్గడం, గుండెపోటు, స్ట్రోక్‌ను నిరోధించడం కూడా ఆస్పిరిన్ మాత్రలు వైద్యులు రోగులకు సూచించడం జరుగుతుంది

ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఈ మాత్రలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే 65 సంవత్సరాలు పైబడిన వారిలో ఆస్పిరిన్ వల్ల రక్తస్రావం, రక్తహీనతకు ఎక్కువగా జరుగుతున్నారని పరిశోధనల ద్వారా హెచ్చరిస్తున్నారు. అందుకే ఆస్పిరిన్ టాబ్లెట్స్ వాడే విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోకుండా డాక్టర్ల సూచించిన మోతాదు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు

 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

Health Tips: ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల కలిగే ఈ లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

పిల్లలు మట్టి, బలపాలు తింటున్నారా..? వారు ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..?

Diabetes: ఈ 5 స్నాక్స్ ను షుగర్ పేషంట్స్ హ్యాపీగా తినవచ్చు.. అవేంటో ఓ లుక్ వేయండి!

Visitors Are Also Reading