Home » పిల్లలు మట్టి, బలపాలు తింటున్నారా..? వారు ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..?

పిల్లలు మట్టి, బలపాలు తింటున్నారా..? వారు ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..?

by Mounika
Ad

మనం ఎక్కువగా చిన్న పిల్లల్లో కొన్ని చెడు అలవాట్లను చూస్తూనే ఉంటాం. మట్టి, బలపాలు తినడం అనేది ఎక్కువగా చాలామంది తల్లిదండ్రులు చిన్నపిల్లలలో గమనించి ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలకు ఇష్టమైన లేక మంచి పోషకాలు కలిగిన ఆహారం పెట్టినా కూడా వారు మట్టి, బియ్యం, బలపాలు వంటివి తినడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ లక్షణాలు కేవలం పిల్లల్లోనే కాకుండా కొంతమంది గర్భిణీలలో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఆహారం కాకుండా తినకూడని పదార్థాలను తినాలనిపించేలా చేయడానికి కారణం ‘పైకా’ అనే డిజార్డర్. ఇదొక మానసిక రుగ్మత అని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

Advertisement

కొందరిలో కొన్ని రకాల పోషక లోపాల వలన ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు ఇలా బియ్యం, చాక్ పీసులు, మట్టి వంటివి తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అలాగే మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారు కూడా ఇలాంటి పదార్థాలను తినడానికి ఆసక్తి చూపుతారు. ఐరన్, జింక్, కాల్షియం వంటి పోషక లోపాలు ఉన్నవారిలో కూడా మట్టి, బలపాలు తినాలన్న కోరిక ఉంటుంది. ఈ పైకా డిజార్డర్ తో బాధపడుతున్నవారు ఇలాంటి వాటిని తినడానికి ఇష్టపడతారు. అయితే ఈ సమస్య అనేది మనం ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది.

Advertisement

ప్రపంచంలోని పిల్లల్లో ఏడాది నుంచి ఆరేళ్ల వయసు లోపల ఉన్న వారిలో పది శాతం నుండి 30% మందిలో ఈ పైకా డిజార్డర్ కనిపిస్తోందని కొన్ని అధ్యయనముల ద్వారా వెళ్లడయ్యింది. ఐరన్ డెఫిషియన్సీ, జన్యుపరమైన రుగ్మతలు , ఓసీడీ వంటి సమస్యలు ఉన్నా కూడా ఈ పైకా అనే రుగ్మత వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చాక్ పీసెస్, బియ్యం, మట్టి తినేవారికి మానసిక వైద్యులకు కౌన్సిలింగ్‌తో పాటు ట్రీట్మెంట్ చాలా అవసరం అని తెలియజేస్తున్నారు.

మీ పిల్లలు గనుక మట్టి, సున్నం, బలపాలు తింటున్నట్టు మీరు గమనించినట్లయితే వెంటనే వైద్యుల్ని సంప్రదించి వారి సలహాలను తీసుకోవడం చాలా ఉత్తమమైన పరిష్కారం. అలాగే పిల్లలు బరువుకు తగ్గ ఎత్తు ఉన్నారో లేదో కూడా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనించుకోవలసిన ముఖ్య విషయం. పిల్లల తినే ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు, నువ్వులు, అవిసె గింజలు, బాదం, మాంసకృతులు, పాలు, పెరుగు వంటివి ఉండేలా చూసుకోండి. ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల పిల్లలలోని పోషకాహార లోపాన్ని నియంత్రించవచ్చు అని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

Eye infection : కండ్లకలక తగ్గాలంటే మన అమ్మమ్మలు చెప్పిన బెస్ట్ చిట్కా ఏంటో తెలుసా..?

Health tips :ఈ వాటర్ ను పొరపాటున కూడా పారబోయకండి.. అమృతంతో సమానం.. ఎందుకంటే?

Health tips : చాతిలో మంటను క్షణాల్లో తగ్గించే బెస్ట్ రెమెడీ ఇది..!

Visitors Are Also Reading