Home » WTC ఫైనల్‌ కి ముందు భారత జట్టుకు భారీ షాక్‌.. గాయపడిన ఆ స్టార్‌ ఆల్‌రౌండర్‌..!

WTC ఫైనల్‌ కి ముందు భారత జట్టుకు భారీ షాక్‌.. గాయపడిన ఆ స్టార్‌ ఆల్‌రౌండర్‌..!

by Anji
Ad

 ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత టీమిండియా వరుసగా రెండోసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఫైనల్ మ్యాచ్ ఆడనున్నది. తొలి ఎడిషన్ లో కివీస్ టీమ్ ఇండియాకు ప్రత్యర్థిగా.. రెండో ఎడిషన్ లో ఆస్ట్రేలియా తో తలపడనుంది టీమిండియా. ఈ గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ కోసం ఇరుజట్లను ఇప్పటికే ప్రకటించారు. ఫైనల్ మ్యాచ్ కి ముందు చాలా మంది ఆటగాళ్లు గాయాల బారిన పడటం  టీమిండియా ను కాస్త ఆందోళన గురిచేస్తోంది. ఇప్పటికే స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా.. ఐపీఎల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిఫ్  ఫైనల్స్ కి దూరమయ్యాడు. రాహుల్ కి బదులుగా ఇషాన్ కిషన్ కి జట్టులో స్థానం కల్పించారు. మరోవైపు శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్ లు కూడా గాయపడ్డారు. వీరిద్దరిపై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ షాక్ నుంచి తేరుకోకముందే టీమిండియాకి మరో ఎదురుదెబ్బ తగిలింది. 

Advertisement

గాయం కారణంగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ కి టీమిండియా స్టార్ ఆల్ రౌండర్  ఆర్. అశ్విన్ దూరమయ్యాడు.  ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో వెన్నెముక గాయం కారణంగా అశ్విన్ ఈ మ్యాచ్ కి దూరం అయ్యాడు. అశ్వినికు బదులుగా ఆడమ్ జంపాను జట్టులోకి తీసుకున్నారు. అశ్విన్ గాయం తీవ్రత ఇంకా తెలియలేదు అయితే… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు ముందు టీమిండియా కు ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే అని చెప్పాలి. ఈ గాయం నుంచి అశ్విని త్వరగా కోలుకోవాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. 

Advertisement

భారత జట్టు : 

 రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.

ఆస్ట్రేలియా జట్టు : 

పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియోన్, మిచెల్ మార్షాన్ , టాడ్ మర్ఫీ, మిచెల్ స్టార్, మాథ్యూ రెన్షా.

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

IPL 2023 : రాజస్థాన్ యశస్వి… విక్రమార్కుడులో నటించాడా…?

 Rajamouli : ఆ హీరోతో ఈ జన్మలో సినిమా చేయను – రాజమౌళి

ఐస్ క్రీమ్ తినగానే దాహం వేస్తుందా ? వెంటనే నీరు తాగితే ప్రమాదమా ?

Visitors Are Also Reading