ఐపీఎల్ చరిత్రలో 1000వ మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ కి మరో ప్రత్యేకత కూడా ఉంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టిన రోజు సందర్భం ఇది. ఇలాంటి అద్భుతమైన సందర్భంలో ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ సూపర్ షో కోసం వాంఖడే స్టేడియం పూర్తిగా నిండిపోయింది. రోహిత్ సేన ఫైర్ కనిపించడం కంటే ముందు రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రోహిత్ పుట్టిన రోజున 1000వ ఐపీఎల్ మ్యాచ్ ను పూర్తిగా కప్పేశాడు. ఐపీఎల్ కెరీర్ లోనే తొలి సెంచరీ కొట్టి ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు.
Also Read : భారీ సిక్స్ బాదిన విండిస్ వీరుడు.. షాక్ లో మిగతా ప్లేయర్స్..!
Advertisement
వాంఖడే స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రారంభం నుంచి చురుకుగా బ్యాటింగ్ చేసాడు. ఫస్ట్ ఓవర్ లోనే జైస్వాల్ కెమరూన్ గ్రీన్ బౌలింగ్ లో సిక్స్ బాదాడు. ఇక ఆ తరువాత ఓవర్ లో జోఫ్రా ఆర్చర్ 6 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ ఓ వైపు పోరాడుతున్నప్పటికీ 21 ఏళ్ల జైస్వాల్ ప్రశాంతంగా ఆడాడు. పవర్ ప్లే చివరి ఓవరి ఓవర్ లో కూడా సిక్స్ కొట్టి జట్టును 65 పరుగులకు చేర్చాడు. ఇక్కడి నుంచి ఒక్కొక్క వికెట్ పడుతూ వస్తుంది. కానీ జైస్వాల్ మాత్రం మెరుస్తూనే ఉన్నాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. హాఫ్ సెంచరీ తరువాత జైస్వాల్ మరింత దూకుడును పెంచాడు.
Advertisement
Also Read : అఖిల్ కి హిట్ పడాలంటే అలా చేయాలంటున్న వేణుస్వామి..!
A maiden #TATAIPL 💯 for Yashasvi Jaiswal 🙌🙌🙌#MIvRR #IPL1000 #IPLonJioCinema pic.twitter.com/W8xyyzEJtS
— JioCinema (@JioCinema) April 30, 2023
ఇక ప్రతీ బౌలర్ ని చిత్తు చేశాడు. 18 ఓవర్ లో చివరి 3 బంతుల్లో ఫోర్లు బాదాడు. ఇందులో రెండో ఫోర్ తో ఐపీఎల్ కెరీర్ లో ఫస్ట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 53 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇందులో 16 ఫోర్లు, 8 సిక్సర్లున్నాయి. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కి చెందిన జైస్వాల్ సెంచరీ సాధించినప్పటికీ విజయం మాత్రం ముంబై ఇండియన్స్ నే వరించింది. భారీ స్కోర్ ని ఛేదించి రికార్డు సృష్టించింది. ముఖ్యంగా చివరి ఓవర్ 17 పరుగులు చేయాల్సి ఉండగా.. టిమ్ డేవిడ్ హ్యాట్రిక్ సిక్స్ లు కొట్టి జట్టుకు విజయతీరాలకు చేర్చాడు. ముఖ్యంగా 14 బంతుల్లో 45 పరుగులు చేశాడు డేవిడ్. మూడు బంతులు మిగిలి ఉండగానే ముంబై జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Also Read : IPL 2023 : ఢిల్లీ ఫ్యాన్స్ ను చితక్కొట్టిన SRH ఫ్యాన్స్… వీడియో వైరల్