Home » భారీ సిక్స్ బాదిన విండిస్ వీరుడు.. షాక్ లో మిగతా ప్లేయర్స్..!

భారీ సిక్స్ బాదిన విండిస్ వీరుడు.. షాక్ లో మిగతా ప్లేయర్స్..!

by Anji
Ad

సాధారణంగా ఐపీఎల్ అనగానే ఎక్కువగా వెస్టిండీస్ ప్లేయర్లకు ఎక్కడా లేని పూనకం వచ్చేస్తుంది. గతంలో క్రిస్ గేల్, పోలార్డ్, రస్సెల్, సిమ్మన్స్, డ్వెయిన్ స్మిత్ వంటి వారు పవర్ హిట్టింగ్ చేస్తూ తమదైన ముద్ర వేశారు. హిట్టింగ్ చేయగలిగే ప్లేయర్లు చాలా మంది ఉన్నప్పటికీ.. విండీస్ ప్లేయర్లు మాత్రం తమకే సాధ్యం అన్నట్టుగా భారీ సిక్సర్లతో విరుచుకుపడతారు. ఈ లక్షణమే వీరిని ఈ లీగ్ లో ప్రధాన ఆకర్షణగా నిలిపింది. అయితే ఈ సీజన్ లో మాత్రం  చాలా మంది విండీస్ ప్లేయర్లు దూరమవ్వడం.. మరోవైపు రస్సెల్ కూడా అంతగా ఫామ్ లో లేకపోవడం వల్ల ఈ సారి కరేబియన్ల హవా అంతగా ఉండదని భావించారు. కానీ ఆ లోటును ఇప్పుడు విండీస్ వీరుడు కైల్ మేయర్స్ తీర్చేశాడు. 

Also Read :  ఐపీఎల్ మ్యాచ్ లో ఉపయోగించే బంతి ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Advertisement

Advertisement

 ఐపీఎల్ లో విండీస్ ప్లేయర్లు ఎప్పుడూ లేని విధంగా ఈసారి చాలా తక్కువ మంది ఉండటం గమనార్హం. ప్రస్తుతం కైల్ మేయర్స్ , పూరన్ వంటి ఆటగాళ్లు కే.ఎల్. రాహుల్ సారథ్యంలోని లక్నో జట్టుకి ఆడుతూ రాణిస్తున్నారు. ముఖ్యంగా మేయర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అయితే కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి విధ్వంసం సృష్టించాడు. ఇందులో భాగంగా మేయర్స్ కొట్టిన ఓ భారీ సిక్సర్ వావ్ అనిపించేవిధంగా ఉంది. బ్రార్ మూడో ఓవర్లో మూడో బంతి నోబాల్ వేయగా ఫ్రీ హిట్ వచ్చింది. ఇక ఈ బంతిని  బ్రార్ స్లో బాల్ గా వేయడంతో విండీస్ ఓపెనర్ భారీ సిక్సర్ కి తరలించాడు. దీంతో ఒక్కసారిగా డగౌట్ లో కూర్చున్న లక్నో ప్లేయర్లు అలాగే చూస్తూ షాక్ లో ఉండిపోయారు. ప్రస్తుతం వీరి రియాక్షన్ వైరల్ గా మారింది. 

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నో జట్టు 56 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాహుల్ సేన ఏకంగా 257 పరుగుల భారీ స్కోర్ చేసింది. మేయర్స్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగగా .. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా బ్యాట్ ఝళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.  భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. అథర్వ తైదే హాఫ్ సెంచరీతో రాణించగా.. సికిందర్ రాజా కాస్త పర్వాలేదనిపించాడు. మిగిలిన వారు విఫలం చెందడంతో  పంజాబ్ కి ఓటమి తప్పలేదు. మొత్తానికి భారీ సిక్సర్లు కొట్టడంలో విండీస్ ప్లేయర్ల తర్వాతే అని మరోసారి నిరూపించాడు కైల్ మేయర్స్. 

Also Read :  చంద్రబాబు, రజనీకాంత్ ఇద్దరు వెన్నుపోటు దారులే అంటూ షాకింగ్ కామెంట్ చేసిన లక్ష్మీపార్వతి..!!

Visitors Are Also Reading