Home » దర్శకుడు రాఘవేంద్రరావుపై పోసాని సెన్షేషనల్ కామెంట్స్ !

దర్శకుడు రాఘవేంద్రరావుపై పోసాని సెన్షేషనల్ కామెంట్స్ !

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా, రచయితగా పేరు సంపాదించుకున్నటువంటి పోసాని కృష్ణ మురళి గత రెండు రోజులుగా టాలీవుడ్ సెలబ్రిటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా నంది అవార్డులను కమ్మ అవార్డులు అంటూ.. ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు పోసాని. అదేవిదంగా నందమూరి బాాలయ్య గురించి సెన్షేషనల్ కామెంట్ చేశారు. 

Also Read :   ప‌వ‌న్ ఫ్యాన్స్ వ‌ర్సెస్ రేణూదేశాయ్..మా అన్న కొడుకును చూపించ‌మంటే అంత‌కోమెందుకంటున్న ఫ్యాన్స్..!

Advertisement

తాజాగా దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని. ఇండస్ట్రీలో రాఘవేంద్రరావు ఎంతో గొప్ప డైరెక్టర్. ఆయన అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పారు. వైసీపీ గెలిచిన తరువాత నటుడు పృథ్వీరాజ్ కి ఎస్వీబీసీ చైర్ పర్సన్ గా నియమించారు. ఆ సమయంలో పృథ్విరాజ్ తనకు ఫోన్ చేసి దర్శకుడు రాఘవేంద్రరావు చాలా అవినీతి పనులు చేశారు. వాటిని కక్కిస్తానని తనకు చెప్పారని పేర్కొన్నారు. “ ఓరోజు రాఘవేంద్రరావు ఉదయాన్నే ఫోన్ చేసి ఏం పోసాని నేను ఏదో అవినీతి చేశానట. పృథ్వీరాజ్ అవన్నీ కక్కిస్తారట అని చెప్పగానే.. సార్ మీరు లంచాలు తిన్నారో లేదో నాకు తెలియదు. కానీ నేను చెబుతాను లేండి అని చెప్పాను. నేను పృథ్వీరాజ్ కి ఫోన్ చేసి పెద్దాయన చాలా మంచి వారు చిన్న చిన్న వాటికి ఆయన ఆశపడరు అని చెప్పాను.   

Advertisement

Also Read :  మామిడి తొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా ?

ఈ విషయం పృథ్వీరాజ్ కు చెప్పగానే నాకు రాఘవేంద్రరావు ఫోన్ చేసి థాంక్స్ చెప్పారు. ఎప్పుడైతే పృథ్వీరాజ్ పదవి పోయిందో ఆక్షణం రాఘవేంద్రరావు మరోసారి ఫోన్ చేసి హహహ మురళి అని పేర్కొన్నారు. తనను తిట్టిన పృథ్వీరాజ్ కి పిలిచి మరీ వేషమిచ్చారు. తనకు మాత్రం వేషం ఇవ్వలేదని చెప్పారు. అందుకు కారణంనేను వైసీపీలోనే కొనసాగడమే”  అని పోసాని వెల్లడించారు. నాతో పని చేయించుకుంటూనే నన్ను ఓ విలన్ ని చేశారని.. రాఘవేంద్రరావుపై పోసాని సంచలన కామెంట్స్ చేశారు. రావణాసురుడి కోసం అతని కొడుకు మేఘనాథుడు చనిపోయాడు. అలా నువ్వు రావణాసురుడి కోసం చనిపోతావా అంటూ నవ్వారని..  ఈ లెక్కన రాఘవేంద్రరావుకి జగన్ పై పీకల వరకు కోపం ఉంది” అంటూ పోసాని చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

Also Read :  ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. రీరిలీజ్ కి సిద్ధమైన హిట్ మూవీ..!

Visitors Are Also Reading