Home » మామిడి తొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా ?

మామిడి తొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా ?

by Anji

సాధారణంగా వేసవికాలం వచ్చిందంటే చాలు మార్కెట్లలో మామిడి పండ్ల విక్రయాలు ప్రారంభమవుతుంటాయి. ఇక ఈ ఏడాది ఇప్పటికే మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. మామిడి పండును ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. ఈ మామిడి పండ్లను తినే సమయంలో సాధారణంగా ప్రజలు తొక్కను పనికి రాని చెత్తగా విసిరి పారేస్తుంటారు. మామిడి తొక్క ఆరోగ్య నిధి అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మామిడి తొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Also Read :  నాలుగు రోజుల్లో ఈ రాశుల వారి జాతకం మారనుంది..! 

మామిడి పండు తొక్క చాలా చర్మ సమస్యలను దూరం చేస్తుంది. ముఖానికి వాటి తొక్కను రాసుకుంటే చర్మం మెరిసిపోతుంది. తొలుత మామిడికాయ తొక్కను మెత్తగా రుబ్బుకొని అందులో కాఫీ పొడి కలపాలి. తయారుచేసిన మిశ్రమంతో మీ చర్మాన్ని స్క్రబ్ చేయండి. జిడ్డు చర్మం ఉన్నట్టయితే కొన్ని చుక్కల కొబ్బరినూనె జోడించవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మానికి మేలు చేకూరుతుంది. ఈ మిశ్రమాన్ని స్క్రబ్ చేసిన తరువాత సబ్బు లేదా ఫేస్ వాష్ తో ముఖాన్ని కడుక్కోకూడదు.మీకు టానింగ్ సమస్య ఉంటే.. మామిడి తొక్కను మెత్తగా రుబ్బి అందులో పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని చర్మంపై 10 నుంచి 15 నిమిషాల పాటు పట్టించి ఆ తరువాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. 

Also Read :   ప్రతీ రోజూ ఈ గింజలు తిన్నారంటే బరువు తగ్గడం పక్కా..!

ఇలా చేయడం వల్ల టానింగ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. చర్మంపై మచ్చలు నుంచి ఉపశమనం పొందవచ్చు. చర్మంపై మచ్చలు తొలగిపోవాలంటే మామిడితొక్కపై కొన్ని చుక్కల తేనె వేసి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల టానింగ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. చర్మంపై మచ్చలు తొలగిపోవాలంటే మామిడి తొక్కపై కొన్ని చుక్కల తేనె వేసి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మచ్చలు తొలగిపోవడమే కాదు.. చర్మం ముడుతలు రాకుండా కనిపిస్తుంది. మామిడి అన్ని సీజన్లలో లభించదు కాబట్టి మామిడి తొక్కలను తీసుకొని ఎండలో ఎండబెట్టండి. ఆ తరవాత దాని మిశ్రమంలా తయారు చేసుకుని భవిష్యత్ లో వాడుకోవచ్చు. 

Also Read :  ఏప్రిల్ 20 శక్తిమంతమైన సూర్యగ్రహణం.. వృశ్చిక రాశి వారికి జరిగేది ఇదే..!

Visitors Are Also Reading