Home » ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. రీరిలీజ్ కి సిద్ధమైన హిట్ మూవీ..!

ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. రీరిలీజ్ కి సిద్ధమైన హిట్ మూవీ..!

by Anji
Ad

ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాల రీ రిలీజ్ హవా కొనసాగుతోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి ప్రముఖ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఎక్కువగా తమ అభిమాన హీరోల పుట్టిన రోజులకు వారి హిట్ చిత్రాలు ప్రత్యేక ప్రదర్శనలను నిర్వహించి జరుపుకుంటున్నారు.  

Also Read :  సిల్క్ స్మిత అప్పుల బాధ‌తో చ‌నిపోలేదా…? మ‌త్తుక‌ళ్ల‌ సుంద‌రి మ‌ర‌ణానికి అస‌లు కార‌ణం ఏంటి..?

Advertisement

జల్సా, పోకిరి, ఆరెంజ్, దేశముదురు వంటి సినిమాల రీ రిలీజ్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టడంలో విజయవంతం అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇప్పుడు తమ హీరో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బ్లాక్ బస్టర్ సినిమా సింహాద్రి మే 20న మళ్లీ విడుదల కానుంది. ఈ సినిమా విడుదలైనప్పుడు భారీ విజయం సాధించింది.

Advertisement

Also Read :  నంది అవార్డులపై విజయేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు..!

ఎన్టీఆర్ బర్త్ డే విడుదల చేయడానికి సరైన ఎంపికగా అభిమానులు భావిస్తున్నారు. సింహాద్రిలో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు. ముఖేష్ రిషి, నాజర్, రాహుల్ దేవ్, బ్రహ్మానందం, శరత్ సక్సెనా వంటి వారు కీలక పాత్రలు పోషించారు. విజయేంద్రప్రసాద్ కథ అందించిన ఈ సినిమాని వి విజయ్ కుమార్ వర్మ నిర్మించారు. ఎం.ఎం. కీరవాణి  సంగీతం సమకూర్చారు. అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది. 

Also Read :  షారూఖ్ సినిమాలో బన్నీ..  షూటింగ్ కూడా ఫినిష్ ? 

Visitors Are Also Reading