Home » ప‌వ‌న్ ఫ్యాన్స్ వ‌ర్సెస్ రేణూదేశాయ్..మా అన్న కొడుకును చూపించ‌మంటే అంత‌కోమెందుకంటున్న ఫ్యాన్స్..!

ప‌వ‌న్ ఫ్యాన్స్ వ‌ర్సెస్ రేణూదేశాయ్..మా అన్న కొడుకును చూపించ‌మంటే అంత‌కోమెందుకంటున్న ఫ్యాన్స్..!

by AJAY

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల రేణూదేశాయ్ ల మ‌ధ్య వార్ జ‌రుగుతోంది. రీసెంట్ గా అఖీరా నంద‌న్ పుట్టిన రోజు జ‌రిగింది. అయితే పుట్టిన రోజు సంధ‌ర్బంగా రేణూదేశాయ్ ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటో లో అఖీరా నంద‌న్ ముఖానికి మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. కాగా ఆ ఫోటోకు ప‌వ‌న్ అభిమాని ఒక‌రు మా అన్న కొడుకుని స‌రిగ్గా చూపించండి మేడ‌మ్.

మా అన్న కొడుకును చూడాల‌ని ఆశ‌గా ఉండ‌దా అంటూ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ పై రేణూ దేశాయ్ ఫైర్ అయ్యింది. మీ అన్న కొడుకా అకీరా నా కొడుకు..ముందు ప‌ద్ద‌తిగా మాట్లాడ‌టం నేర్చుకోండి. మీరు వీరాభిమానులు కావ‌చ్చ కానీ ప‌ద్ద‌తి గా ఉండ‌టం నేర్చుకోండి అంటూ ఫైర్ అయ్యింది. ఇక రేణూ దేశాయ్ చేసిన కామెంట్ పై ప‌వ‌న్ అభిమానులు మండిప‌డుతున్నారు.

మా అన్న కొడుకు అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఇక ఓ నెటిజ‌న్ రేణూ దేశాయ్ కామెంట్ ల పై స్పందిస్తూ మా అన్న‌య్య కొడుకును చూపించ‌మంటే ఎందుకంత కోపం. తెలుగు రాష్ట్రాల‌లో నువ్వు ఎవ‌రి బిడ్డ‌వు అని అడిగితే తండ్రి పేరే చెబుతారు. అంటూ రిప్లై ఇచ్చాడు.

అయితే కొంత‌మంది నెటిజ‌న్ లు రేణూదేశాయ్ కి స‌పోర్ట్ చేస్తూ కామెంట్ లు చేస్తున్నారు. విడాకులు తీసుకున్న నాటి నుండి రేణూ దేశాయ్ త‌న కొడుకును పెంచుకుంటుందని కాబ‌ట్టి ఆమెను అలా అడిగే హ‌క్కు మీకు ఎక్క‌డిద‌ని కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రేణూ దేశాయ్ గ‌తంలో కూడా ఫ్యాన్స్ వ‌ల్ల ఇబ్బంది ప‌డిన సంధ‌ర్బాలు ఉన్నాయి.

ALSO READ : ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. రీరిలీజ్ కి సిద్ధమైన హిట్ మూవీ..!

Visitors Are Also Reading