Home » మార్చి 08న మహిళల కోసం కొత్త స్కీమ్.. తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ అదేనా..? 

మార్చి 08న మహిళల కోసం కొత్త స్కీమ్.. తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ అదేనా..? 

by Anji

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 08న తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. దీనికోసం సీఎం సూచనల మేరకు వైద్యారోగ్య శాఖ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తుంది. మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలపై వైద్యారోగ్య శాఖ ఫోకస్ పెట్టింది. ప్రతీ మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర మహిళలకు బహుమతిగా హెల్త్ స్కీమ్ తీసుకొస్తుంది. ప్రతీ మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య సేవలందించబోతుంది. తొలిదశలో 100 ఆరోగ్య కేంద్రాలలో ఈసేవలు ప్రవేశపెట్టనున్నారు. 1200 పీహెచ్ సీ, యూపీహెచ్ సీ, బస్తీ దవఖానా కేంద్రాలకు విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.  

Also Read :  మార్చి 6 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే

  1. మధుమేహం రక్తపోటు, రక్తహీనత, సాధారణ పరీక్షలు. 
  2. ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్. 
  3. థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మపోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు విటమిన్ బీ 12, విటమిన్ డీ పరీక్షలు చేసి చికిత్స మందులు అందజేస్తారు. 
  4. మూత్రకోశ సంబంధిత ఇన్పెక్షన్లు, పెల్విక్ ఇన్ ప్లేమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు. 
  5. మెనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మన్ రీప్లేస్ మెంట్ థెరపీ చేయడంతో పాటు కౌన్సిలింగ్ తో అవగాహన కలిగిస్తారు. 
  6. నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం అవసరమైన వారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు. 
  7. పలు అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యమందిస్తారు. 
  8. బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటి వాటిపై అవగాహన కలిగిస్తారు. 

Also Read :  Amigos OTT Release: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

 

ఈ వైద్య పరీక్షలన్నీ ఉచితంగానే చేయనున్నారు. ప్రత్యేక యాప్ ద్వారా మానిటరింగ్ ఉంటుంది. తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారు. సమస్యలున్నవారికి రెఫరల్ సెంటర్లు, ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులకు పంపుతారు. సంబంధిత మహిళలకు పూర్తిగా నయమయ్యే వరకు వైద్య సేవలు అందించే కార్యక్రమం ఉంటుంది. రిఫరల్ ఆసుపత్రుల్లో మహిళలకు సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఉంటుంది. ప్రత్యేక సేవల గురించి మహిళా సంఘాలు మెప్మా వారికి అవగాహన కల్పించనున్నారు. 

Also Read :  Writer Padmabhushan : ఓటీటీలోకి ‘రైటర్ పద్మభూషణ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Visitors Are Also Reading