Home » Writer Padmabhushan : ఓటీటీలోకి ‘రైటర్ పద్మభూషణ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Writer Padmabhushan : ఓటీటీలోకి ‘రైటర్ పద్మభూషణ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

by Anji
Ad

ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి సూపర్ హిట్ గా నిలుస్తున్న చిత్రాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలాంటి వాటిలో చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ అందుకున్న చిత్రం రైటర్ పద్మభూషణ్ ఒకటి. విలక్షణమైన పాత్రలతో గుర్తింపు సంపాదించుకున్న హీరో సుహాస్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, రోహిణి, టీనా శిల్పరాజ్ కీలక పాత్రల్లో నటించారు. 

Also Read :   కాంతార కంటే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి రూ.50కోట్లకు పైగా వసూలు చేసిన మూవీ ఏదో తెలుసా ?

Advertisement

Advertisement

ఫిబ్రవరి 03న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని డీసెంట్  హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో మరోసారి నటుడిగా ప్రశంసలు అందుకున్నారు హీరో సుహాస్. ఇప్పటివరకు థియేటర్లలో అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5 రైటర్ పద్మభూషణ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి 22న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంపై అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు మేకర్స్.  

Also Read :  Amigos OTT Release: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

విజయవాడకి చెందిన ఓ మధ్య తరగతి కుర్రాడు పద్మభూషణ్ అలియాస్ భూషణ్ ఓ గ్రంథాలయంలో అసిస్టెంట్ లైబ్రేరియన్ గా పని చేస్తుంటాడు. ఎప్పటికైనా రైటర్ పద్మభూషణ్ అనిపించుకోవాలనేది అతని కల. అందుకోసం అని ఇంట్లో వాళ్లకి తెలియకుండా లక్షలు అప్పు చేసి తొలి అడుగు పేరుతో ఓ బుక్ రాస్తాడు. కానీ పాఠకులతో ఆ బుక్ ని చదివించడానికి పడరాని పాట్లు పడుతుంటాడు. ఆతరువాత పద్మభూషణ్ జీవితంలో ఎదురైన సంఘటనలే  ఈ రైటర్  పద్మభూషణ్. 

Also Read :  బాలయ్యను ఏపీ సీఎంగా చూడాలని తారకరత్న భావించారా.. అందుకే ఇలా చేశారా ?

Visitors Are Also Reading