సాధారణంగా వారం రోజుల పాటు 8 నుంచి 9 గంటలు పని చేస్తుంటారు. వీకెండ్ వచ్చే సరికి మధ్యలో బయటికి వెళ్లాలని చాలా మంది కోరుకుంటారు. పార్టీలు, పబ్బులతో ఎంజాయ్ చేస్తుంటారు. వారాంతాల్లో ఎంజాయ్ మెంట్ సమయంలో తీసుకున్న డ్రింక్స్ ఆ తరువాత వారిని చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. వాస్తవానికి సరదా మూడ్ లో మద్యంతో ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు. సోమవారం ఆఫీస్ లో పని చేయడం కష్టంగా ఉంటుంది. కొన్ని సార్లు హ్యాంగోవర్ ఎక్కువవుతుంది. ఇలా కొందరూ ఆఫీస్ లకు సెలవు పెట్టి ఇంటికి తిరిగి వెళ్తారు. వారాంతం తరువాత మాత్రమే హ్యాంగోవర్ రావాల్సిన అవసరం లేదు. ఏ రోజు అయినా సరదా మూడ్ లో సామర్థ్యం కంటే ఎక్కువ డ్రింక్స్ తీసుకోవడం వల్ల హ్యాంగోవర్ అనేది వస్తుంది.
Advertisement
ఏదైనా మత్తు పదార్థం వినియోగించే ముందు దానిపై శరీరానికి హానికరం అని స్పష్టంగా రాయబడుతుంది. అయినప్పటికీ చాలా మంది ఆనందం కోసం తాగుతుంటారు. సరదా మూడ్ లో శరీర సామర్థ్యాన్ని కూడా అస్సలు పట్టించుకోరు. ఒకదాని తరువాత ఒకటి పలు రకాల వెరైటీలను స్వాహా చేస్తుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మన శరీరం రోజుకు 3 పానియాలను మాత్రమే జీర్ణం చేసుకుంటుంది. అంతకు మించి తాగితే వాంతులు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. మీకు హ్యాంగోవర్ సమస్య ఉంటే.. లేదంటే లేదా మీ ఇంట్లో ఎవరైనా హ్యాంగోవర్ తో బాధపడుతుంటే మీరు కొన్ని ఇంటి నివారణలను పాటించడం ద్వారా దానిని అధిగమించవచ్చు.
Advertisement
ఏదైనా డ్రింక్ పార్టీ జరిగిన మరుసటి రోజు మీరు నిద్రలేచిన తరువాత అల్పాహారం తప్పనిసరిగా తీసుకోండి. హ్యాంగోవర్ ని తగ్గించడంలో అల్పాహరం సహాయపడుతుంది. తాగిన డ్రింక్స్ వల్ల తలనొప్పి లేదా హ్యాంగోవర్ అనుభూతిని కలిగి ఉంటే అల్పాహారంలో అరటిపండు, పీనట్స్ బట్టర్ తో బ్రెడ్ తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తలనొప్పి, అలసటను తొలగిస్తుంది. అదేవిధంగా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగాలి. మీరు పార్టీ రాత్రి లేదా మరుసటి రోజు ఉదయం నిమ్మరసం తయారు చేసుకుని తాగాలి. దీంతో వికారం, వాంతులు తగ్గుతాయి.
టీ, కాఫీలు తీసుకోవడం ద్వారా వీటిలో ఉండే కెఫిన్ శరీరాన్ని అప్రమత్తం చేస్తుంది. శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. పెరుగు తీసుకోవడం వల్ల కూడా ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా అల్లం కూడా యాంటీ ఆక్సిడెంట్ మాదిరిగా పని చేస్తుంది. అల్లం టీ తాగడం వల్ల డయేరియా, వికారం, వాంతులు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. స్పోర్ట్స్ డ్రింక్స్ తీసుకోవడం ద్వారా కూడా హ్యాంగోవర్ ని తగ్గించుకోవచ్చు. వీటిలో ఎలక్ట్రోలైట్స్ చాలా ఉంటాయి. వాస్తవానికి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో ఉప్పు, పొటాషియంల పరిమాణం తగ్గుతుంది.