టాలీవుడ్ హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్లుగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బాహుబలి సినిమా తెలుగు సినిమా సత్తాను చాటి దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలపై క్రేజ్ ని పెంచేసింది. హీరోలు పాన్ ఇండియా రేంజ్ కి మారడంతో రెమ్యునరేషన్ దాదాపు రూ.100 కోట్లకు పైగానే తీసుకుంటున్నారు. కేవలం హీరోలు మాత్రమే కాదు.. వారి భార్యలు కూడా హీరోయిన్ల కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నారు. ఎవరెవరి భార్య ఎంత సంపాదిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రామ్ చరణ్- ఉపాసన :
Advertisement
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తొలుత ఉపాసన రామ్ చరణ్ ప్రేమని ఒప్పుకోలేదట. రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో ఆసుపత్రిని నడపడంలో బిజీగా ఉంది. ఆమె బి పాజిటివ్ అనే హెల్త్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్. ఉపాసన సంపాదన కొన్ని కోట్లలో ఉంటుంది.
మహేష్ – నమ్రత :
మహేష్, నమ్రత వీరిద్దరూ కలిసి వంశీ సినిమాలో నటించారు. ఆ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ కాస్త పెళ్లి పీటల వరకు వెళ్లింది. మహేష్ భార్య నమ్రత మహేష్ బిజినెస్ లన్నింటికి కో ఫౌండర్ అని చెప్పవచ్చు. హీరోయిన్లకు మించి ఆమె సంపాదన ఉంటుంది.
అల్లు అర్జున్- స్నేహారెడ్డి :
అల్లు అర్జున్, స్నేహారెడ్డి ప్రేమించుకున్నారు. ఆ తరువాత పెళ్లితో ఒక్కటయ్యారు.అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి పికాబో ఫోటో స్టూడియో నడుపుతోంది. స్పెక్ట్రమ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ నెలకు కొన్ని కోట్లు సంపాదిస్తోంది.
నాని-అంజనా :
నాని భార్య అంజనా ఆర్కా కూడా ఆర్కా మీడియాలో క్యాస్టూమ్ డిజైనర్. ఒక డిజైనర్ స్టూడియోను కూడా నడుపుతూ భారీగానే సంపాదిస్తుంది.
Advertisement
అల్లరి నరేష్ – విరూప :
అల్లరి నరేష్ ఓ వైపు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు అల్లరి నరేష్ భార్య విరూప కూడా ఈవెంట్ ఆర్గనైజర్ గా పని చేస్తూ లక్షల్లోనే సంపాదించడం విశేషం.
మంచు విష్ణు – వెరోనికా :
మా అధ్యక్షుడు మంచు విష్ణు భార్య వెరోనికా కు హోటల్ బిజినెస్ ఉంది. ది కేక్ రూమ్ అనే పేరుతో సెలబ్రిటీలకు స్పెషల్ ఫుడ్ అందిస్తూ భారీగానే సంపాదిస్తుంది.
దగ్గుబాటి రానా – మీహికా :
రానా భార్య మీహికా ఇంటిరియర్ డిజైనర్ గా పని చేస్తోంది. టాప్ మోస్ట్ సెలబ్రిటిస్ హౌసెస్ కి ఇంటీరియర్ డిజైన్ చేస్తూ హీరోయిన్ల కంటే ఎక్కువగానే సంపాదిస్తుంది.
Also Read : అందరినీ ఆకట్టుకునేలా భార్యకి అద్భుతమైన గిప్ట్.. అది చూసి భార్య ఫిదా ..!
నితిన్ – షాలిని :
నితిన్ భార్య షాలిని లండన్ లో మాస్టర్స్ చేసింది. ఇక షాలిని కార్పొరేట్ కంపెనీలో పని చేస్తూ కోట్లలోనే సంపాదిస్తుంది.
Also Read : తండ్రి కాబోతున్న రాహుల్ రామకృష్ణ.. పెళ్లెప్పుడు అయిందబ్బా..!!
నిఖిల్-పల్లవి :
నిఖిల్ భార్య పల్లవి ఒక డాక్టర్. ఆమె సొంతంగా ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేసి నడిపిస్తోంది. ఆసుపత్రి నడిపిస్తుందంటే ఆదాయం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
Also Read : కళ్యాణ్ రామ్ చిత్రానికి టైటిల్ ఖరారు.. మూడు పాత్రల్లో..!