ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ కమెడియన్లలో రాహుల్ రామకృష్ణ ఒకరు. ప్రస్తుతం వస్తున్న ప్రతి సినిమాలో రాహుల్ రామకృష్ణ కామెడీ ఒక ప్రత్యేకత చాటుకుంటుంది. అలాంటి రాహుల్ రామకృష్ణ తండ్రి కాబోతున్నానంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు. దింతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. అసలు మీకు పెళ్లెప్పుడు అయింది బ్రో అంటూ ప్రశ్నిస్తున్నారు.. ఇటీవల కాలంలోనే సోషల్ మీడియా వేదికగా తన కాబోయే భార్యకు లిప్ లాక్ ఇస్తూ రాహుల్ పెళ్లి ప్రకటన చేసిన విషయం మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయనకు పెళ్లి జరిగింది కానీ పెళ్లికి సంబంధించిన విషయాలు కానీ ఎక్కడ బయటకు రాలేదు.
Advertisement
Ad
కానీ ఒక్కసారిగా తన భార్య ప్రెగ్నెంట్ అంటూ విషయాన్ని షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఈ విషయం వైరల్ గా మారింది. ఏంటి బాబు పెళ్లి విషయం చెప్పనేలేదు.. అసలు మీకు పెళ్లి జరిగిందా లేదా.. అంటూ నెటిజన్లు వివిధ రకాల ప్రశ్నలతో కామెంట్లు పెడుతున్నారు. అయితే గత నెలలో మాత్రం ” సే హాయ్ టు మై లైఫ్ “.. సే హలో టు మై లిటిల్ ఫ్రెండ్ ” అంటూ తనదైన శైలిలో ఒక పోస్టు చేశారు. ప్రస్తుతం రాహుల్ రామకృష్ణ తనదైన కామెడీతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
Advertisement
also read:షూటింగ్ లో నిద్రపోయిన జగ్గయ్యను సావిత్రి ఎంత ఏడిపించేవారో తెలుసా..?
Say hello to our little friend pic.twitter.com/q7t5htIZEO
— Rahul Ramakrishna (@eyrahul) November 7, 2022
షార్ట్ ఫిలింలో నటిస్తూ కెరియర్ ను ప్రారంభించిన రామకృష్ణ మొదట్లో హీరోలకు ఫ్రెండ్ పాత్రలు చేస్తూ చాలా ఫేమస్ అయ్యారు. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో విజయ్ దేవరకొండకు స్నేహితుడిగా తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో హీరో ఇంత క్రేజ్ సంపాదించుకున్నారో అదే లెవల్లో రాహుల్ రామకృష్ణ కూడా గుర్తింపు పొందారు. దీని తర్వాత వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.
also read: