Home » కళ్యాణ్ రామ్ చిత్రానికి టైటిల్ ఖరారు.. మూడు పాత్రల్లో..!

కళ్యాణ్ రామ్ చిత్రానికి టైటిల్ ఖరారు.. మూడు పాత్రల్లో..!

by Anji
Ad

టాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను చేస్తూ డీసెంట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఇటీవల‘బింబిసార’ అనే చిత్రంతో సూప‌ర్ డూప‌ర్ హిట్ సాధించారు. ఈ భారీ విజ‌యం త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్ డెబ్యూ డైరెక్ట‌ర్ రాజేందర్ రెడ్డితో తన తరువాత నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది.   NKR 19 చిత్రానికి మేక‌ర్స్ ఇవాళ ‘అమిగోస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విభిన్నమైన పాత్ర‌లు, సినిమాలు చేసే హీరో క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తోన్న ఈ సినిమా టైటిల్ కూడా డిఫ‌రెంట్‌గా ఉండ‌టంతో అంద‌రిలో ఓ క్యూరియాసిటీ క్రియేట్ అయింది. 

Advertisement

‘అమిగోస్’ నిర్మాణం ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. అమిగోస్ అనేది ఒక  స్పానిష్ ప‌దం. ఓ స్నేహితుడిని సూచించ‌డానికి లేదా రెఫ‌ర్ చేయ‌డానికి ఈ ప‌దాన్ని ఉప‌యోగిస్తుంటారు. ఈ టైటిల్ అనౌన్స్ చేయ‌టంతో పాటు స్టైలిష్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను కూడా విడుదల  చేశారు. ఈ పోస్ట‌ర్ సినిమా కాన్సెప్ట్ ఏంట‌నే విష‌యాన్ని సూచిస్తుంది. క‌ళ్యాణ్ రామ్ పాత్ర మూడు షేడ్స్‌లో ఉంటుంద‌నే విష‌యాన్ని ఈ పోస్ట‌ర్ ఎలివేట్ చేస్తుంది.  

Advertisement

Also Read :  అందరినీ ఆకట్టుకునేలా భార్యకి అద్భుతమైన గిప్ట్.. అది చూసి భార్య ఫిదా ..!

manam News

‘దె సే వెన్‌ యు మీట్‌ సమ్‌బడీ దట్‌ లుక్స్ జస్ట్ లైక్‌ యు, యు డై’  అనేది పోస్ట‌ర్‌పై క్యాప్ష‌న్‌గా క‌నిపిస్తుంది. ఈ పోస్ట‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మేక‌ర్స్ మ‌రింత‌గా పెంచేశారు. ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 10, 2023న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేయ‌డంలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఎన్నో సెన్సేష‌న‌ల్ మూవీస్‌ను అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న  ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్‌కు జోడీగా ఆషికా రంగ‌నాథ్ న‌టిస్తోంది.  గిబ్రాన్ సంగీతం సమకూర్చుతున్నారు.  ఈ చిత్రానికి  ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, త‌మ్మిరాజు ఎడిట‌ర్‌గా పని చేస్తున్నారు. 

Also Read :  ఆ హీరోకు నేను వీరాభిమానిని.. స్టార్ హీరో యశ్..!!

Visitors Are Also Reading