Home » అందరినీ ఆకట్టుకునేలా భార్యకి అద్భుతమైన గిప్ట్.. అది చూసి భార్య ఫిదా ..!

అందరినీ ఆకట్టుకునేలా భార్యకి అద్భుతమైన గిప్ట్.. అది చూసి భార్య ఫిదా ..!

by Anji
Ad

ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. ప్రతి విషయం కూడా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు తెగ చెక్కర్లు కొట్టేస్తున్నాయి. ఇందులో ఒకటి రవీందర్, మహాలక్ష్మిల పెళ్లి.  ఎందుకంటే సీరియల్ నటి మహాలక్ష్మి చూడడానికి కుందనపు బొమ్మలా కనిపిస్తుంది.  ఇలాంటి మహాలక్ష్మి లావుగా ఉన్న తమిళ్ ప్రొడ్యూసర్ రవీందర్ ని పెళ్లి చేసుకోవడమే. అందులోనూ వీరిద్దరిదీ రెండో వివాహం కావడం విశేషం.

Advertisement

చాలామంది అప్పట్లో మహాలక్ష్మి కేవలం మనీ కోసం మాత్రమే పెళ్లి చేసుకుంది అని పుకార్లు పుట్టించారు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఈ కొత్త జంట సంతోషంతో ముందుకు సాగిపోతున్నారు. అయితే ఇటీవల దీపావళి పండుగ కానుకగా రవీందర్ తన భార్య మహాలక్ష్మికి ఒక ఖరీదైన కారును గిఫ్టుగా ఇచ్చాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల దీపావళి పండుగను రవీందర్, మహాలక్ష్మి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.  ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా అప్పుడు సోషల్ మీడియాలో  దర్శనమిచ్చాయి.  ఇటీవల రవీందర్ తన భార్యకు ఎంజి మోటార్ కంపెనీ యొక్క గ్లోస్టర్ SUV ని గిఫ్ట్ గా అందించారు.

మనం జీవితాంతం ప్రేమించే వ్యక్తిని కనిపెట్టడం చాలా కష్టం. మనం ప్రేమించే వ్యక్తి, తిరిగి మనల్ని అంతే గొప్పగా ప్రేమిస్తే అది మరింత గొప్పగా ఉంటుంది. కొత్త భార్య, కొత్త జీవితం, కొత్త కారు ఈజీ డ్రైవింగ్ అండ్ క్రేజీ అంటూ ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. ఇది కూడా వైరల్ అవుతోంది. దీనికి 90,000 పైగా లైకులు వచ్చాయి. ఎంజి గ్లోస్టర్ అద్భుతమైన లైటింగ్ సెటప్, పనోరమిక్ సన్ రూఫ్, 19 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ అండ్ రియల్ ఫాగ్ లాంప్స్, స్టీరింగ్-అసిస్ట్ కార్నరింగ్ లాంప్స్, డ్యూయల్ బారెల్ క్రోమ్ ఎగ్జాస్ట్ వంటివి వాటిని పొందుతుంది. ఈఎస్ యూవీ యొక్క ఇంటీరియర్స్ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 10. 25 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉంటుంది. ఇది ఆపిల్ కార్ఫ్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఐ-స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీ, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, 8 ఇంచెస్ MID ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పాడిల్ షీఫ్టర్లు, 3-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ట్ టెయిల్ గేట్, హీటెడ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు వైర్ లెస్ చార్జింగ్ వంటివి కూడా ఉన్నాయి.

Advertisement

Also Read :   ఆదిపురుష్ వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

ఎంజి గ్లోస్టర్ చూడటానికి భారీగానే  ఉంటుంది.  దీని పొడవు 4,985  మి.మీ.  వెడల్పు 1926 మి.మీ. ఎత్తు 1867 మి.మీ వీల్ బేస్ 2950 మీటర్ల వరకు ఉంటుంది.  వాహన వినియోగదారులకు మంచి క్యాబిన్ స్పేస్ తో పాటు మంచి హెడ్ రూమ్ వంటి వాటిని అందిస్తుంది. ఎంజి గ్లోస్టర్ బేస్ వేరియంట్ లోని 2.0 లీటర్ టర్బో డీజిల్ 4000 ఆర్ పిఎమ్ వద్ద 160 బిహెచ్ పి పవర్ మరియు 1500 నుండి 2400 ఆర్ పి ఎమ్ వద్ద 375 ఎన్ ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టాప్-స్పెక్ ట్రిమ్స్ లోని 2.0 లీటర్ ట్విన్ – టర్బో యూనిట్ 4000 ఆర్ పి ఎమ్ వద్ద 216 బిహెచ్ పి మరియు 1500-2400 ఆర్ పి ఎమ్ వద్ద 480 ఎన్ ఎమ్ టార్క్ అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ యొక్క రెండు వెర్షన్లు స్టాండర్డ్ 8- స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో జత చేయబడతాయి. కావున మంచి పనితీరుని అందిస్తాయి. ఎంజి గ్లోస్టర్ ఎస్ యూవీ నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అవి అగాటా రెడ్, మెటల్ బ్లాక్, మెయిల్ యాష్ మరియు వార్మ్ వైట్ కలర్స్, అంతే కాకుండా ఇందులో మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్ధారిస్తాయి.

Also Read :  నార్త్ వ‌ర్సెస్ సౌత్ మూవీస్ డిబెట్‌లో ర‌కుల్ కామెంట్స్ వింటే ఆశ్య‌ర్య‌పోవ‌డం ప‌క్కా..!

Visitors Are Also Reading