భారత జట్టులోని క్రికెటర్స్ కు ఇచ్చినంత రెస్ట్ మారె జట్టులోని ఆటగాళ్లకు ఇవ్వరు అనేది నిజం. అయిన కూడా ఆటగాళ్లు కీలక సమయాల్లో గాయపడి జట్టుకు దూరం అవుతూ ఉంటారు. అలంటి కారణాల వల్లే ఈ మధ్యే జట్టులో ఎక్కువ మార్పులు అనేవి జరిగాయి. అయితే ఇప్పుడు టీం ఇండియా షియా కప్ కోసం యూఏఈకి వెళ్ళింది. కానీ ఈ టోర్నీ ఆరంభానికి ముందే ఇండియాకు వరుస షాక్స్ అనేవి తగులుతున్నాయి.
Advertisement
జట్టును ప్రయతించే సమయంలోనే టీం ఇండియా ముఖ్యమైన బౌలర్ బుమ్రా ఫిట్ లేకపోవడంతో అతను జట్టుకు అందుబాటులో ఉండటం లేదు అని ప్రకటించింది బీసీసీఐ. ఆ తర్వాత హర్షల్ పటేల్ కూడా గాయం కారణంగా దూరమయ్యాడు. ఇక ఇప్పుడు మరి కీలక పేసర్ దీపక్ చాహర్ కుడా గాయపడినట్లు తెలుస్తుంది. అయితే చాహర్ ఈ ఏడాది ఐపీఎల్ కు ముందే గాయం బారిన పడి ఆరు నెలలు జట్టుకు దూరం అయ్యాడు.
Advertisement
ఇక ఈ మధ్యే కోలుకున్న దీపక్ చాహర్ ను ఆసియా కప్ ను నేరుగా ఎంపిక చేయని బీసీసీఐ.. స్టాండ్ బై ఆటగాళ్లలో ఒక్కడిగా చేర్చింది. ఇక అతడిని ప్రాక్టీస్ కోసం జింబాంబ్వే పర్యటనకు పంపింది. అయితే అక్కడ వన్డే సిరీస్ లో బాగానే రాణించిన చాహర్.. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడినట్లు తెలుస్తుంది. దాంతో చాహర్ ఆసియా కప్ కు అందుబాటులో ఉండటం లేదు అని సమాచారం.
ఇవి కూడా చదవండి :