Home » నాలో సత్తా లేకపోతే ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు..!

నాలో సత్తా లేకపోతే ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు..!

by Azhar
Ad
టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ పైన చాలా రోజులుగా చర్చ అనేది జరుగుతున్న విషయం తెలిసందే. మూడు ఏళ్లుగా సెంచరీ అనేది చేయలేకపోయినా విరాట్ కోహ్లీ.. గత ఏడాది ముగిసిన టీ20 ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ కూడా వదిలేసినట్లు కనిపిస్తుంది. అంత ఘోరంగా ప్రతి మ్యాచ్ లోను అభిమానులను నిరాశపరుస్తూనే ఉన్నాడు. అందుకే కోహ్లీ పని అయ్యిపోయింది అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
ఇక తన పేలవ ఫామ్ పై జరుగుతున్న చర్చ పైన విరాట్ కోహ్లీ స్పందించాడు. అయితే నెలకు పైగా విశ్రాంతి అనేది తీసుకున్న కోహ్లీ ఈ నెల 27 నుండి ప్రారంభం అవుతున్న ఆసియా కప్ లో పాల్గొనబోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ… నేను గతంలో 2014 లో జరిగిన ఇంగ్లాండ్ పర్యటనలో కూడా విఫలం అయ్యాను. కానీ ఆ ఫెల్యూర్ అనేది నాకు మంచి పాటలు నేర్పింది.
కానీ తప్పులను గ్రహించి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాను. అప్పటితో పోల్చితే ఇప్పుడు ఫామ్ లోకి రావణ చాలా సులభం. అయితే నేను ఒక్కసారి లయ అందుకుంటే గతంలో మాదిరే పరుగులు చేస్తున్నాను. ఇక నాలో టాలెంట్ అనేది లేకపోతే నేను ఇక్కడివరకు వచ్చేవాడిని కాదు. కాబట్టి నేను ఏం చేయాలో.. నా పాత్ర ఏంటో నాకు బాగా తెలుసు అని విరాట్ పేర్కొన్నాడు.

Advertisement

Visitors Are Also Reading