Telugu News » Blog » కేఎల్ రాహుల్ తో కూతురి పెళ్లిపై సునీల్ శెట్టి క్లారిటీ..!

కేఎల్ రాహుల్ తో కూతురి పెళ్లిపై సునీల్ శెట్టి క్లారిటీ..!

by Manohar Reddy Mano
Ads

టీమ్ ఇండియాలో ఇప్పుడు ఉన్న కీలక ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ కూడా ఒక్కడు. అయితే ఈ మధ్యే ఎక్కువగా గాయాల వాళ్ళ జట్టుకు దూరంగానే ఉంటున్నాడు రాహుల్. క్రికెట్ కెరియర్ ను పక్కకు పెడితే కేఎల్ రాహుల్ అలాగే బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అథియా శెట్టి ఇద్దరు ప్రేమలో మునిగితేలుతున్న విషయం అనేది తెలిసిందే. ఈ మధ్య జర్మనీకి రాహుల్ సర్జరీకి వెళ్ళిన అథియాను తీసుకెళ్లాడు.

Advertisement

ఈ క్రమంలోనే వీరి పెళ్లి పైన చాలా పుకార్లు అనేవి వస్తున్నాయి. అయితే తాజాగా రాహుల్, అథియా పెళ్లిపైన సునీల్ శెట్టి క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. అవును మేము పెళ్లి చేయాలి అని అనుకున్నాము. కానీ ఎప్పుడు చేసుకోవాలి అనేది వారి ఇష్టం. రాహుల్ కు గ్యాప్ ఎప్పుడు దొరికితే అప్పుడే వారి పెళ్లి అనేది చేయాలనుకుంటున్నం. అయితే రాహుల్ షెడ్యూల్ చూస్తే భయం వేస్తుంది.

Advertisement

వారికీ రెస్ట్ అనేది ఉండటం లేదు. కేవలం ఒక్క రోజు రెండు రోజుల గ్యాప్ ఉంటుంది. కానీ పెళ్లి అనేది ఆట కాదు. అంత తొందరగా చేయడానికి. ఆడపిల్ల తండ్రిగా తొందరగా పెళ్లి చేయాలనీ నేను అనుకుంటున్నాను. కానీ రాహుల్ ఇప్పుడు ఆసియా కప్, ప్రపంచ కప్ అంటూ చాలా బిజీగా ఉన్నాడు. కాబట్టి అతనికి ఎప్పుడు గ్యాప్ అనేది దొరికిహే అప్పుడే పెళ్లి అని సునీల్ శెట్టి అన్నారు. అయితే రాహుల్ ఇప్పుడు టీం ఇండియాతో కలిసి ఆసియా కప్ కోసం యూఏఈ వెళ్ళిన విషయం తెలిసిందే.

Advertisement

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ ఒక్క ఆఫ్ఘన్ టీం లాంటిదే…!

బంగ్లా వేదిక వుమెన్స్ ఆసియా కప్.. ఈ టోర్నీ చరిత్ర తెలుసా మీకు..?