టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌ను ఎట్టకేలకు ఇవాళ బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఓపెనర్ కే.ఎల్. రాహుల్, యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, పేసర్ జస్‌ప్రీత్‌సింగ్ బుమ్రాల పేర్లు కెప్టెన్‌గా వినిపించినప్పటికీ బీసీసీఐ మాత్రం రోహిత్ శర్మపైనే నమ్మకం ఉంచింది. ఇప్పటికే వన్డే, టీ-20 ఫార్మాట్‌లలో ముందుండి నడిపిస్తోన్న రోమిత్ సుదీర్ఘ ఫార్మాట్‌లో కూడా జట్టుకు విజయాలు అందించగలడని బీసీసీఐ ప్రకటించింది. దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ తరువాత టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ రాజీనామా చేసిన విషయం తెలిసినదే. బీసీసీఐ తాజాగా తీసుకున్న నిర్ణయంతో భారత జట్టుకు మూడు ఫార్మాట్లకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ప్రస్తుతం స్వదేశంలో విండిస్‌తో మ్యాచ్‌లు ఆడుతున్న టీమిండియా త్వరలో శ్రీలంకతో పోరుకు సిద్ధం అవుతుంది. సొంతగడ్డపైనే మూడు టీ-20, రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడనున్నది. శ్రీలంకతో సిరీస్ కోసం రేసుగుర్రం జస్‌ప్రిత్ బుమ్రాను వైస్ కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ. ఫాం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న సీనియర్ బ్యాట్స్‌మెన్ పుజారా, అజింక్యా రహానేలకు జట్టు నుంచి తప్పించారు. టీ-20 మ్యాచ్‌ల నుంచి కోహ్లీ, రిషబ్ పంత్‌లకు విశ్రాంతిని ఇచ్చారు. ఫిబ్రవరి 24న లక్నో వేదికగా శ్రీలంకతో టీ-20 మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఆ తరువాత ధర్మశాలలో రెండు, మూడవ మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి టెస్ట్ మార్చి 3-7 మొహలీ, రెండో టెస్ట్ బెంగళూరు వేధికగా జరగనున్నది.
Advertisement
Advertisement
Also Read : పాకిస్తాన్ క్రీడాభిమానులకు క్షమాపణలు చెప్పిన ఫాల్క్‌నర్
టీ-20 టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, ఇషాన్‌కిషన్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్‌కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్.
టెస్ట్ సిరీస్ జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కే.ఎస్.భరత్, రవిచంద్రన్ అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేష్ యాదవ్, సౌరభ్ కుమార్ ఉన్నారు.
Also Read : వార్డు వాలంటీర్ ఘరానా మోసం.. రూ.2 కోట్లు వసూలు చేసి తల్లి, కూతురు పరారీ