Home » వార్డు వాలంటీర్‌ ఘరానా మోసం.. రూ.2 కోట్లు వసూలు చేసి త‌ల్లి, కూతురు పరారీ

వార్డు వాలంటీర్‌ ఘరానా మోసం.. రూ.2 కోట్లు వసూలు చేసి త‌ల్లి, కూతురు పరారీ

by Anji
Ad

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వార్డు వాలంటీర్ ఘ‌రానా మోసం వెలుగులోకి వ‌చ్చింది. పొదుపు, వ‌డ్డీల పేరుతో సాలూరులో వార్డు వాలంటీర్‌గా విధులు నిర్వ‌హిస్తున్న ర‌మ్య ఆమె త‌ల్లితో క‌లిసి వందలాది మందిని న‌మ్మించి డ‌బ్బులు చెల్లించుకున్నారు. బాధితుల నుంచి సుమారు రూ.2కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి పరార‌వ్వ‌డంతో బాధితులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ప‌ది రోజుల‌కు పైగా ఆమె క‌నిపించ‌క‌పోవ‌డంతో బాధితులు పెద్ద సంఖ్య‌లో పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లారు.

Also Read :  సుడిగాలి సుధీర్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడో చెప్పిన బుల్లెట్ భాస్కర్

Advertisement

సాలూరు ప‌ట్ట‌ణంలోని చిట్లు వీధికి చెందిన ర‌మ్య‌, ఆమె త‌ల్లి అరుణతో క‌లిసి 15 ఏళ్లుగా పొదుపు వ్యాపారం చేస్తున్నారు. ప‌లు వీధుల్లో వ‌డ్డీ ఆశ చూపి దాదాపుగా 2వేల మంది వ‌ద్ద నుంచి డ‌బ్బులు వ‌సూలు చేశారు. వారి స్థోమ‌త‌ను బ‌ట్టి రూ.5వేల వ‌ర‌కు చిట్టీలు పొదుపు రూపంలో వ‌సూలు చేశారు. ఏడాదికి వ‌డ్డీతో క‌లిపి పొదుపు డ‌బ్బులు ఇస్తామ‌ని చెప్పారు. మ‌హిళ‌లు దాచుకున్న పొదుపు డ‌బ్బుల‌ను ప్ర‌తీ సంవ‌త్స‌రం సంక్రాంతి పండుగ‌కు ముందు ఇచ్చేవారు. త‌మ డ‌బ్బులు న‌మ్మ‌కంగా తిరిగి చెల్లిస్తుండ‌డంతో ఈ విష‌యం ఆ నోటా, ఈ నోటా ప‌డి ప‌ట్ట‌ణ‌మంతా తెలిసి ఆమె వ‌ద్ద చిట్టీలు కట్టేవారు, పొదుపు చేసే వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది.

Advertisement

ఆమె అధిక వ‌డ్డీ ఇస్తుంద‌నే ఉద్దేశంతో అప్పులు ఇచ్చిన వారున్నారు. ర‌మ్య‌కుమారి, త‌ల్లి అరుణ కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేశారు. కానీ ఈ ఏడాది సంక్రాంతి పండుకు డ‌బ్బులు ఎవ్వ‌రికీ చెల్లించ‌లేదు. సంక్రాంతి త‌రువాత ఇస్తాన‌ని న‌మ్మ‌బ‌లికింది. ఆ త‌రువాత డ‌బ్బుల కోసం అంద‌రూ ఆమె ఇంటికి క్యూ క‌ట్ట‌డంతో డ‌బ్బులు చెల్లించాల‌ని అడిగితే బ్యాంకులో ఏదో స‌మ‌స్య ఉంద‌ని చెప్పి న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు. 10 రోజుల కింద‌టే ర‌మ్య స్పందించ‌క‌పోవ‌డంతో పొదుపు చేసిన వారంద‌రికీ అనుమానం వ‌చ్చింది. బంధువుల‌ను ఆరా తీసినా స‌మాధానం రాక‌పోవ‌డంతో బాధితులు మోస‌పోయామ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకి కోసం పోలీసులు ఆరా తీస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.

Also Read :  పాకిస్తాన్ క్రీడాభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఫాల్క్‌న‌ర్

Visitors Are Also Reading