election rally

ఎన్నికల ర్యాలీలో ఆత్మాహుతి దాడి

Updated By ManamTue, 10/02/2018 - 18:42
  • 13మంది దుర్మరణం.. 30మందికి పైగా తీవ్రగాయాలు

Suicide bomber, election rally, Afghanistan, 13 killedకాబూల్: అఫ్గానిస్థాన్ ఎన్నికల ర్యాలీలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు స్థానిక మీడియా నివేదించింది. మంగళవారం మధ్యాహ్నం నాన్‌గర్హర్ ప్రావిన్స్‌లో బాంబు దాడి జరిగినట్లు అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కామా జిల్లాలో అక్టోబర్ 20న జరగనున్న అఫ్గానిస్థాన్ పార్లమెంటరీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న అబ్దుల్ నాజర్ మహ్మద్ మద్దతుదారులు ప్రచారం నిర్వహించారు.

ప్రచారంలో భాగంగా మద్దతుదారులంతా కలిసి గుంపుగా ఒకచోట చేరిన క్రమంలో ఆత్మాహుతి దాడి జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. ఆత్మాహుతి దాడిలో గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే ఈ ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి సంబంధించి ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.పాక్ ఎన్నికల ర్యాలీలో ఆత్మాహుతి దాడి

Updated By ManamWed, 07/11/2018 - 11:52
  • పెషావర్ ఆత్మాహుతి దాడిలో 20మంది మృతి

Peshawar suicide attack

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ఎన్నికల ప్రచారంలో దాడులు జరగవచ్చన్న నేషనల్‌ కౌంటర్‌ టెర్రరిజం అథారిటీ (నాక్టా) హెచ్చరికలు నిజమయ్యాయి. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో నిన్న జరిగిన ఆత్మాహుతి దాడి 20 మంది మృతి చెందగా, సుమారు 30మందికిపైగా గాయపడ్డడారు. కాగా పెషావర్‌లో అవామీ నేషనల్‌ పార్టీ (ఏఎన్‌పీ) ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ర్యాలీలో పాల్గొన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.

కాగా మృతుల్లో ఏఎన్‌పీ అభ్యర్థి హరూన్‌ బిలౌర్‌ ఉన్నారు. పాకిస్తాన్‌లో ఈ నెల 25న సార్వత్రిక ఎన్నికల జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల బరిలో హరూన్‌ కూడా ఉన్నారు. ఆయన ప్రసంగం ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే ఆత్మాహుతి దాడి జరిగింది. కాగా ఈ దాడికి తామే బాధ్యులమని  పాక్ తాలిబాన్లు ప్రకటించారు. 

మరోవైపు ఈ దాడి ఘటనను పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌​ చీఫ్‌, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్రంగా ఖండించారు. అన్ని రాజకీయ పార్టీల నేతలకు భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇమ్రాన్ ట్వీట్ చేశారు. అలాగే ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న జాబితాలో ఇమ్రాన్‌‌తో పాటు అవామీ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు అఫ్సన్‌దర్‌ వలి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్‌ సయీద్‌ కుమారుడు కూడా ఉన్నారు.

Related News